ఆదర్శం.. ఆచరణీయం.. సత్యసాయి సందేశం

తన ప్రసంగాలతో అసంఖ్యాక ప్రజానీకానికి స్ఫూర్తి కలిగించేవారు సత్యసాయిబాబా. ఒక సందర్భంలో ‘ప్రేమ స్వరూపులారా! మీరంతా పరమాత్మ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ఆధ్యాత్మికతను అలవరచుకోవాలి, ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైనా సరే.

Updated : 30 Nov 2023 01:08 IST

న ప్రసంగాలతో అసంఖ్యాక ప్రజానీకానికి స్ఫూర్తి కలిగించేవారు సత్యసాయిబాబా. ఒక సందర్భంలో ‘ప్రేమ స్వరూపులారా! మీరంతా పరమాత్మ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ఆధ్యాత్మికతను అలవరచుకోవాలి, ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైనా సరే.. సత్యాన్నే పలుకుతూ.. ధర్మంగా నడుచుకోవాలి. ప్రశాంత చిత్తాన్ని అలవరచుకుని, అందరి పట్ల ప్రేమభావంతో మెలగాలి. అప్పుడే మనశ్శాంతి, అటు పిమ్మట విశ్వశాంతి లభిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి స్వార్థం పెద్ద అవరోధం. నిస్వార్థ చింతన ఔన్నత్యానికి సూచన. శాశ్వతం కాని ఈ దేహంపై మోహం ఎందుకు? అహం వదిలి, కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి. ఆకలి గొన్నవారికి అన్నం పెట్టాలి. పెద్దలను మన్నించాలి, తల్లిదండ్రులను పూజించాలి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలతో ముందుకు సాగుతూ మహనీయులుగా ఎదగాలి. భగవంతుడు అందరినీ గమనిస్తుంటాడని గుర్తుంచుకోవాలి’ అంటూ దివ్య సందేశం అందించారు సత్యసాయిబాబా.

ఎల్‌. ప్రఫుల్ల చంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని