స్మరణతో దైవసన్నిధి సాధ్యం

భాగవతంలో భగవంతుణ్ణి పొందటానికి సూచించిన నవవిధ భక్తి మార్గాల్లో స్మరణ ఒకటి. నిరంతర స్మరణతో దైవసన్నిధి సులభమవుతుంది. కానీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ అనేక ఆలోచనలు వస్తుంటాయి.

Updated : 21 Dec 2023 04:08 IST

భాగవతంలో భగవంతుణ్ణి పొందటానికి సూచించిన నవవిధ భక్తి మార్గాల్లో స్మరణ ఒకటి. నిరంతర స్మరణతో దైవసన్నిధి సులభమవుతుంది. కానీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ అనేక ఆలోచనలు వస్తుంటాయి. వాటిని లక్ష్యపెట్టకుంటే ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి. సాధకులు మనోనిగ్రహాన్ని అలవరచుకోవాలి. సదా భగవన్నామస్మరణలో ధ్యాసపెడితే, ఇతర విషయాలమీదికి మనసు మళ్లినా మళ్లీ వెనక్కు వస్తుంది.

సామాన్యంగా మన దృష్టికోణమంతా ‘నేను, నాది, మీరు, మీది’ అనే విషయాల చుట్టూ తిరుగుతుంటుంది. సర్వత్రా భగవంతుడే నిండి ఉన్నాడనే జ్ఞానం కలిగిందంటే ఇక రెండో ఆలోచనకు అవకాశం లేదు. అప్పుడు ఏకాగ్రత సాధ్యమవుతుంది. మనిషి ఒంటరిగా ఉన్నా కూడా.. మానసికంగా అనేకులతో కూడి ఉంటాడు. ఆ ఊహలూ, ఆలోచనలను సైతం దైవంతో ముడిపెట్టుకుంటే- ఇక మనసు అంత త్వరగా ఇతర విషయాల జోలికి వెళ్లదు. భగవంతుడే సత్యం. మిగిలినదంతా మాయ- అని తెలుసుకోవటమే జ్ఞానం. ఈ స్థితికి రావాలంటే ఎంతో సాధన అవసరం. మనసును స్థిరపరచుకోవాలి. అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. దైవసన్నిధి లభిస్తుంది. 

టి.వి.యెల్‌.గాయత్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని