పిడుగులు పడే సమయంలో అర్జునా, ఫల్గుణా అని ప్రార్థించాలా?
భారీవర్ష సమయంలో పిడుగులు కూడా పడుతుంటాయి. ఇవి ఎక్కువగా చెట్లపైన పడటం గమనిస్తాం. పిడుగు పడేటప్పుడు పెద్దశబ్ధం వస్తుంది. ఇంట్లో పిల్లలు ఈ శబ్ధాన్ని విని భయపడుతారు...
భారీవర్ష సమయంలో పిడుగులు కూడా పడుతుంటాయి. ఇవి ఎక్కువగా చెట్లపైన పడటం గమనిస్తాం. పిడుగు పడేటప్పుడు పెద్దశబ్ధం వస్తుంది. ఇంట్లో పిల్లలు ఈ శబ్ధాన్ని విని భయపడుతారు. పిల్లలతో పాటు పెద్దలకు భయాన్ని దూరం చేసేందుకు అర్జునా,ఫల్గుణా అని పదినామాలను జపిస్తాం. మహాభారతంలో అజ్ఞాతవాసం ముగిసిన సమయంలో కౌరవులు విరాటరాజుకు చెందిన గోవులను అపహరిస్తారు. దీంతో విరాటరాజు కుమారుడైన ఉత్తరుడు వాటిని తీసుకువచ్చేందుకు బృహన్నల (అర్జునుడు) రథాన్ని నడుపుతుండగా యుద్ధానికి బయలుదేరుతాడు. అదే సమయంలో అజ్ఞాతవాసం ముగియడంతో అర్జునుడు తన యథారూపాన్ని దాల్చుతాడు.శత్రు సేనలు చూసిన ఉత్తరుడు భయంతో పారిపోగా అతనికి అర్జునుడు నచ్చజెప్పి తాము దాచిన ఆయుధాల ప్రాంతానికి వెళుతారు. శమీవృక్షంపై ఆయుధాలను చూసిన ఉత్తరునికి అవి సర్పరూపాలుగా కనిపిస్తాయి. దీంతో అర్జునుడు తన పదినామాలైన అర్జునా,ఫల్గుణా, బీభత్స, కిరీటీ, సవ్యసాచి, కృష్ణ, ధనంజయ, శ్వేతవాహన, విజయ,పార్థ అని జపించమంటాడు. దీంతో ఉత్తరునికి భయం తొలగి ఆయుధాలను చెట్టుపై నుంచి కిందకు తీసుకువస్తాడు. భయాన్ని పొగొట్టే మంత్రంగా దీనిని పెద్దలు చెబుతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి