Viral Video: ఇకపై అల్లరి చేయను టీచర్‌.. ఈ చిన్నోడు ఎంత ‘ముద్దు’గా క్షమాపణలు చెప్పాడో..!

అల్లరి చేస్తున్నావంటూ నొచ్చుకున్న టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ బుడ్డోడు ఆమెకు క్షమాపణలు చెబుతున్న వీడియో ఒకటి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది..........

Published : 14 Sep 2022 01:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లరి చేస్తున్నావంటూ నొచ్చుకున్న టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ చిన్నారి ఆమెకు క్షమాపణలు చెబుతున్న వీడియో ఒకటి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడ జరిగిందో స్పష్టత లేని ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం అది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ఎంత చెప్పినా నువ్వు అల్లరి చేస్తూనే ఉన్నావ్‌. అల్లరి చేయనంటూనే మళ్లీ మళ్లీ చేస్తున్నావ్‌’ అంటూ ఉపాధ్యాయురాలు ఆ బాల విద్యార్థి తీరు పట్ల నొచ్చుకుంటారు. ‘ఇకపై నీతో మాట్లాడబోను’ అని కూడా ఆమె పేర్కొంటారు.

అయితే, దీనికి ఆ చిన్నారి స్పందిస్తూ.. ఇకపై ఎప్పుడూ అల్లరి చేయబోనంటూ ఆ అలిగిన టీచర్‌ను సముదాయించే ప్రయత్నం చేస్తాడు. ఇకపై చేయను.. నిజంగా చేయను అంటూ ఆ విద్యార్థి ముద్దుముద్దుగా పదేపదే చెప్పడంతో ఆ టీచర్‌ సంతోషిస్తుంది. అయితే ముద్దుపెట్టుకోమని అడగటంతో ఆ టీచర్‌ రెండు చెంపలపైనా ఆ చిన్నోడు ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్ల ఆదరిస్తుండటంతో ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికే 3.32లక్షల మంది వీక్షించారు. 18వేల మంది లైక్‌ చేశారు. ‘వీడియో ఎంతో ముద్దుగా ఉంది’, ‘మా పాఠశాల రోజుల్లో ఇలాంటి టీచర్లు ఎందుకు లేరు’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని