భార్యపై అనుమానం.. భర్త ఏం చేశాడంటే..?

భార్యాభర్తల బంధం ఎంతో విలువైంది. కాపురంలో చిన్నపాటి తగాదాలు, గొడవలు వస్తే చక్కగా ఇద్దరూ చర్చించుకుని సమస్యను...

Updated : 07 Dec 2022 13:55 IST

నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార్యాభర్తల బంధం ఎంతో విలువైనది. కాపురంలో చిన్నపాటి తగాదాలు, గొడవలు వస్తే చక్కగా ఇద్దరూ చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. అప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోతే విడిపోయి ఎవరి బతుకు వారి బతికేయవచ్చు. భార్యమీదగానీ, భర్తపైగానీ అనుమానం లాంటి కారణాలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకునే పరిస్థితులను ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం. అక్రమ సంబంధాలు హత్యలకూ దారి తీస్తున్నాయి. అయితే బొలీవియాకు చెందిన ఓ వ్యక్తి చేసిన పని నెట్టింట్లో విపరీతంగా వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. అసలేమి జరిగిందంటే.. 

బొలీవియాకు చెందిన  ఓ వ్యక్తి తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందనే అనుమానం ఉంది. దానిని ఎలాగైనా నిరూపించి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికే ఆమె గర్భవతి. అయితే ఆ బిడ్డ తన వల్ల పుట్టబోయేది కాదని వైద్య నివేదికలను సైతం సిద్ధం చేశాడు. అప్పటికే తన భార్య, వేరొకరు సన్నిహితంగా కలిసి ఉన్న వీడియోను సంపాదించాడు. వీటన్నింటినీ తన ఇంట్లో జరుగుతున్న వేడుకలోనే ఓ లాయర్‌తో బహిర్గతం చేయించాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా నోరెళ్లబెట్టారు. అంతలోనే ఓ మైక్‌ను అందుకుని తన భార్యకు పుట్టబోయే బిడ్డకు తాను తండ్రిని కాదని చెప్పాడు. దీనికి కారణం తన కుటుంబ స్నేహితుడని.. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని చూపిస్తాడు. ఒక్కసారిగా బంధువులంతా అతడిపై దాడి చేసేందుకు యత్నిస్తారు.. కోపముంటే మరీ ఇంతలా పరువు తీయాలా.. అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని