అవకాశవాద బంధం.. అయినా.. ఓకే!
ఓ కుర్రది.. ఇంకో కుర్రాడు.. నిత్యం అభిప్రాయాలు కలబోసుకుంటారు... వాళ్లు స్నేహితులేం కాదు కుదిరితే పెళ్లాడాలనుకుంటారు.. వీలుకాకపోతే బ్రేకప్ చెప్పేసుకుంటారు... అయినా ప్రేమికులేం కాదు!
ఓ కుర్రది.. ఇంకో కుర్రాడు.. నిత్యం అభిప్రాయాలు కలబోసుకుంటారు...
వాళ్లు స్నేహితులేం కాదు
కుదిరితే పెళ్లాడాలనుకుంటారు.. వీలుకాకపోతే బ్రేకప్ చెప్పేసుకుంటారు...
అయినా ప్రేమికులేం కాదు!
మరి వాళ్ల మధ్య ఉన్న బంధమేంటి? అంటే అది ‘సిచ్యుయేషన్‌షిప్’. యువత నోళ్లలో ఈ మధ్యకాలంలో బాగా నానుతున్న సరికొత్త రిలేషన్‌షిప్ ట్రెండ్.
అనిరుధ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సహోద్యోగి మౌనిక అంటే ఇష్టం. ఆమెకూ అతడిపై అదే ఫీలింగ్. కలిసి పార్టీలకెళ్తారు. ప్రేమికుల్లాగే పార్కుల్లో తిరుగుతారు. అన్నీ సవ్యంగా జరిగితే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇంతలోనే అతగాడికి బెంగళూరులో మంచి ఉద్యోగం దొరికింది. అక్కడే స్థిరపడే అవకాశం వచ్చింది. ఆ అమ్మాయితో అనుబంధానికి బ్రేకప్ అన్నాడు. తనూ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పింది. ఇదే సిచ్యుయేషన్‌షిప్. ఇది ఒక్క అనిరుధ్ కథే కాదు. మిలీనియన్లు, జనరేషన్ జడ్‌లో చాలామంది ఇదే బాటలో ఉన్నారు. ఈ ధోరణిలో అమ్మాయి, అబ్బాయి మధ్య మంచి అవగాహన ఉంటుంది. అభిప్రాయాల కలబోత ఉంటుంది. కానీ కమిట్మెంట్లూ కాకరకాయలేం ఉండవు. ఆ ఇద్దరూ చూడ్డానికి ప్రేమ పక్షుల్లాగే ఉంటారు. ఏ క్షణమైనా పెళ్లిపీటలెక్కుతారు అన్నట్టుగానే ఉంటారు. కానీ పెళ్లి బాసల ప్రస్తావన ఉండదు. కుదిరితే సరి. లేదంటే.. ఎవరి దారి వారిదే. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బంధం ప్రేమకి తక్కువ.. స్నేహానికి ఎక్కువ. ‘మేం లవ్‌లో ఉన్నాం..’, ‘ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తున్నా’ అని సిగ్గుల మొగ్గలవుతూ చెప్పే ప్రేమికుల్లాగే.. ‘మేం సిచ్యుయేషన్‌షిప్‌లో ఉన్నాం’ అని చెప్పుకోవడం పట్టణాలు, నగరాల్లోని ఆధునిక యువతకి ఎక్కువవుతోంది.
లాభనష్టాలేంటి?
ప్రేమ విఫలమైతే దేవదాసులయ్యేవాళ్లు.. ప్రేమ పేరుతో రక్తపాతాలు సృష్టించే వాళ్లూ అక్కడక్కడా ఉండొచ్చుగాక.. ఈ కాలం యువత బంధాలు.. అనుబంధాలు.. కెరియర్ విషయంలో పిచ్చ క్లారిటీతో ఉంది. ముఖ్యంగా జీవితాన్ని మలుపు తిప్పే ఈ వయసులో ఎలా నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో వాళ్లకి బాగా తెలుసు. ఈ వయసు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. యువతలో దండిగా ఉండే శక్తిని సానుకూలంగా వాడుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. కానీ ప్రేమ, ఆకర్షణల మత్తులో అత్యధికులు మగ్గిపోతుంటారు. రిలేషన్‌షిప్‌ల మత్తులో మునిగిపోతుంటారు. సిచ్యుయేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లు.. అలాంటి రకం కాదు. మనసుకి నచ్చినవాళ్లతో వాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. పేరెంట్స్, కెరియర్, భవిష్యత్తు కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ‘నీకోసమే నా జీవితం..’, ‘నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా’, ‘నీకోసం ప్రాణాలైనా ఇస్తా’ లాంటి డైలాగులు వాళ్ల డిక్షనరీలోనే ఉండవు. ప్రేమ, అనుబంధం పేరుతో.. దేన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండరు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లది అవకాశవాదం, స్వార్థ బుద్ధి. అయితే అవతలి వాళ్లను మోసం చేసే ఉద్దేశం లేకపోవడం.. ప్రేమకన్నా జీవితమే ఎక్కువ అనే స్పష్టత ఉండటంతో ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లది టేకిటీజీ పాలసీ అంటుంటారు మానసిక నిపుణులు.
లాభనష్టాలేంటి?
* సిచ్యుయేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లు ఒక్కరికే అంకితమైపోరు. మెరుగైన ఎంపిక దొరికినప్పుడు మరో కొత్త బంధం మొదలవుతుంది. జీవితంలో ఎదగడానికి తోడ్పడుతుంది.
* ఈ బంధంతో అనవసర మానసిక ఒత్తిళ్లు ఉండవు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కెరియర్‌కి ఆటంకం ఏర్పడదు. ఇష్టపడ్డ అమ్మాయి లేదా అబ్బాయికి ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వకపోడంతో అనవసర బాధ్యతలు ఉండవు.
* రోబోలా అందరికీ ఒకేలా ఉండటం కుదరకపోవచ్చు. ఒక అమ్మాయి లేదా అబ్బాయికి దగ్గరైనప్పుడు కొందరు మానసికంగానూ దగ్గరవుతుంటారు. సిచ్యుయేషన్‌షిప్ కాస్తా డీప్ రిలేషన్‌షిప్‌గా మారితే మానసిక ఒత్తిళ్లు తప్పవు.
* అనుబంధాలను తేలికగా తీసుకోవడంతో.. భవిష్యత్తులోనూ దగ్గరి వాళ్లపట్ల సీరియస్ ప్రేమలు, ఆప్యాయతలు కనబరచలేకపోయే ప్రమాదం ఉంటుంది.
* సిచ్యుయేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లలో కొందరు ఒక్క భాగస్వామితోనే ఆగిపోరు. ఇష్టపడ్డవాళ్లలో ఏ చిన్న విషయం నచ్చకపోయినా వాళ్లని వదిలేసి ఇతరుల వైపు చూస్తారు. ఇది మల్టీపుల్ రిలేషన్‌షిప్స్‌కి దారి తీయొచ్చు.
వారికి నప్పదు..
ఈమధ్యకాలంలో కొందరు ప్రేమ పేరుతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రేమించినవాళ్లవీ తీస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అలాంటి రిలేషన్‌షిప్‌లతో పోలిస్తే సిచ్యుయేషన్‌షిప్‌ను ఎంచుకోవడం మంచిదే. ఈ బంధమూ విపత్కర పరిస్థితులకు దారి తీయకుండా ఉండాలంటే.. అమ్మాయి, అబ్బాయి తమ అభిప్రాయాలు, వ్యక్తిత్వం ముందే ఒకరికొకరు స్పష్టంగా చెప్పుకోవాలి. కెరియర్, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లకి ఇది అనుకూలమైన రిలేషన్‌షిప్. సున్నిత మనస్కులకు నప్పదు. ఈ ట్రెండ్ రాబోయే రోజుల్లో విస్తృతమవుతుంది.
రష్మీ దేశ్‌ముఖ్, సైకాలజిస్ట్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: వైకాపా ఇసుక మాఫియాకు ఇదే ప్రత్యక్షసాక్ష్యం: నారా లోకేశ్ సెల్ఫీ
-
Politics News
Chidambaram: భాజపా అసహనానికి ఇదే నిదర్శనం: చిదంబరం
-
General News
KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్: కేటీఆర్
-
World News
Japan: ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. ఒకదాన్నొకటి తాకి..
-
Politics News
ChandraBabu: అక్రమాలను అడ్డుకోండి: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
-
Sports News
Team India Slip Cordon: టీమ్ ఇండియా స్లిప్ కార్డన్‌లో ఎవరు బెస్ట్.. ChatGPT ఏం చెప్పింది?