ఫ్యాషన్లు.. ఫరవాలేదు
ఫ్రెషర్స్ పార్టీకి ముస్తాబైన జూనియర్‌లా వచ్చింది 2020... అభిమాన మాస్టారిలా అనుభవ పాఠాలు నేర్పింది... ప్రతీదీ పంచుకునే బెంచ్‌మేట్‌లా.. మనసుకి నచ్చిన జిగిరీ దోస్త్‌లా మధుర జ్ఞాపకాలు అందించింది... ఇష్టం లేకున్నా అప్పుడప్పుడు వచ్చిపడే ఎగ్జామ్స్‌లా కఠిన పరీక్షలూ పెట్టింది... పీకల్లోతు ప్రేమలో ముంచేసి బ్రేకప్ చెప్పిన లవర్‌లా కొన్ని బాధల్ని మిగిల్చింది... అన్ని భావోద్వేగాలు పంచి ఆఖరికి కాలేజీ ఫేర్‌వెల్ పార్టీలా కనుమరుగై వెళ్లిపోతోంది... అందుకే.. ఈ యేడు మనకి అందించిన తీపి గురుతులను మననం చేసుకుందాం... చేదు అనుభవాలను పాఠాల్లా మలచుకుందాం... కోటి ఆశల తోరణాల కట్టి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదాం.
లాక్‌డౌన్, కరోనాలు ఫ్యాషన్ పరవళ్లకు ఈ ఏడాది కాస్త అడ్డుకట్ట వేశాయనే చెప్పొచ్చు. అయినా సోకులపై మోజు ఎక్కువుండే యువత తమ శాయశక్తులా ట్రెండీగా ఉండటానికి ప్రయత్నించారు.
కో-ఆర్డ్ సెట్లు: ఆధునికంగా కనిపించాలి అనుకునే అమ్మాయిల్లో అత్యధికులు ఫాలో అయింది ఈ స్టైల్‌నే. ఆకట్టుకునేరూపంతోపాటు ధరిస్తే ఎంతో సౌకర్యవంతంగా ఉండటం వీటి ప్రత్యేకత. అదితీరావు హైదరీ, దియా మీర్జా, నుస్రత్ బరూచా.. పలు సందర్భాల్లో ధరిస్తూ ఈ స్టైల్‌కి దాదాపు బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేశారు.
చీరతో సింగారం: చుక్కనమ్మలు చాలామంది చక్కగా సింగారించుకొని తొమ్మిది గజాల చీరకి మరింత శోభ తెచ్చిన ఏడాది ఇది. శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండగల సందర్భాల్లో చీర ధరించి పెద్దపీట వేశారు. వీటిలోనూ సీక్విన్స్ ఎక్కువ పాపులర్ అయ్యాయి. చీరపై మినిమల్ జ్యువెల్లరీ ధరించి తారలు హొయలొలికించారు. ప్యాంట్‌సూట్‌లు: పవర్ డ్రెసింగ్‌తో సత్తా చూపించాలనుకున్న అమ్మాయిలు ప్యాంట్‌సూట్లు ఆదరించారు. స్టైల్ పాతదే అయినా కొద్దిపాటి మార్పులు చేసి ఆధునిక ట్రెండ్‌కి తెర తీశారు.
క్రాస్ బాడీ బ్యాగ్‌లు: స్టైలిష్‌గా కనిపించాలి అనుకునే కుర్రాళ్లు క్రాస్ బాడీ బ్యాగ్‌లతో చెలరేగిపోయారు. ముఖ్యంగా కాలేజీ క్యాంపస్‌లు, కార్పొరేట్ ఆఫీసుల్లోని అబ్బాయిల ఒంట్లో ఇవి భాగమైపోయాయి. ఒంటిని చుట్టేస్తే పొడవాటి స్ట్రాప్‌తో, నడుము కిందికి ఈ క్రాస్ బాడీ బ్యాగ్‌లు ఈ ఏడాది మేటి ట్రెండ్‌లలో ఒకటిగా చెప్పొచ్చు.
ఫ్లేర్స్: డెబ్బైలలో ఒక ఊపు ఊపిన ఫ్లేర్స్ ప్యాంట్లు, ట్రౌజర్లు 2020లో మళ్లీ విజృంభించాయి. క్యాజువల్ షర్ట్‌లు, స్లిమ్ ఫిటింగ్, టర్ట్‌ల్ నెక్ షర్ట్‌లు.. వేటిపై ధరించినా స్టైలిష్‌గా ఉండటంతో ఫ్యాషన్ గురూల సలహాను పాటించిన అబ్బాయిలు ఫ్లేర్స్‌కి ఓటేశారు.
ఫిట్‌నెస్ హిట్
కసరత్తులు చేసి కండలు పెంచేద్దాం.. అనుకున్న కుర్రాళ్లకు కరోనా అడ్డు తగిలింది. అయినా బరువులెత్తకపోతే ఆరోగ్యానికి భరోసానే లేదు అని భావించే మనోళ్లు ఊరుకోరుగా! ఇల్లునే వ్యాయామశాలగా మార్చేశారు. ఆరుబయటే జాగింగ్, వాకింగ్.. మొదలు పెట్టేశారు. తెరలకు అతుక్కుపోతే కలిగే అనారోగ్య తంటాలకు చెక్ పెట్టేలా వర్కవుట్లు అధికం చేశారు. మంచి శారీరక యోగం దక్కాలంటే యోగానే మెరుగైన మార్గం అని తెలుసుకున్నవాళ్లు ఆచరణలోకి దిగారు. ఫిట్‌నెస్‌కు మించి టోన్డ్ బాడీ కావాలని కోరుకున్న వాళ్లకి చిన్నచిన్న ఎక్విప్‌మెంట్‌లతో, వివిధ రకాల భంగిమల్లో, కండరాలను బ్యాలెన్స్ చేస్తూ పైలేట్స్‌పై పట్టు సాధించేలా సలహాలిచ్చారు నిపుణులు. దీంతోపాటు ఈ ఏడాదిలో అందరి నోళ్లలో అత్యధికంగా నానిన పదం హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్. ఆశావహుల్ని ఆకట్టుకునేలా ఫిట్‌నెస్ గురూలు వర్చువల్ క్లాసులకు తెర లేపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
GT vs CSK: రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ మిస్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!