మడమ తిప్పని లుక్‌

యావత్‌ యువత లెంగ్త్‌కు కనెక్ట్‌ అవుతోన్న ఫ్యాషన్‌. స్కిన్‌ఫిట్‌ యాంకిల్‌ లెంగ్త్‌(మడమ వరకే) జీన్స్‌ తొడిగి.. లూపర్స్‌ వేసి.. షార్ట్‌ టీషర్ట్‌ వేసుకుంటే ట్రెండీ లుక్‌ మనదేనని జెండా ఎగరేయొచ్చు. అందరికళ్లు మనమీదికి తిప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌కు హీరో విజయదేవరకొండ యాంకిల్‌లెంగ్త్‌ ఫార్మల్‌ సూట్‌లో వచ్చి సందడి చేయడంతో దీనిపై మరింత చర్చ నడుస్తోంది. ఈ ఫ్యాషన్‌ అసలు ముందు ...

Published : 20 Oct 2018 07:49 IST

యాంకిల్‌ లెంగ్త్‌... 

మడమ తిప్పని లుక్‌

యావత్‌ యువత లెంగ్త్‌కు కనెక్ట్‌ అవుతోన్న ఫ్యాషన్‌. స్కిన్‌ఫిట్‌ యాంకిల్‌ లెంగ్త్‌(మడమ వరకే) జీన్స్‌ తొడిగి.. లూపర్స్‌ వేసి.. షార్ట్‌ టీషర్ట్‌ వేసుకుంటే ట్రెండీ లుక్‌ మనదేనని జెండా ఎగరేయొచ్చు. అందరికళ్లు మనమీదికి తిప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌కు హీరో విజయదేవరకొండ యాంకిల్‌లెంగ్త్‌ ఫార్మల్‌ సూట్‌లో వచ్చి సందడి చేయడంతో దీనిపై మరింత చర్చ నడుస్తోంది. ఈ ఫ్యాషన్‌ అసలు ముందు అమ్మాయిలతోనే మొదలైంది. తర్వాత అబ్బాయిలూ ఫాలో అయిపోతున్నారు. విదేశాల్లో వర్షాకాల ఫ్యాషన్స్‌లో భాగంగా డిజైనర్లు వీటిని పరిచయం చేశారు. ఇప్పుడు అన్ని కాలాలకూ ట్రెండైపోయింది. ఈ ప్యాంట్లు వేసుకొంటే కొంచెం పొడుగ్గా కన్పిస్తుండటంతో ఎక్కువమంది వీటిని అనుసరిస్తున్నారని ఫ్యాషన్‌ నిపుణులు చెబుతున్నారు. నైట్‌అవుట్‌ పార్టీలకు, స్నేహితులతో విహారాలకు వీటితో బాగా ఆకట్టుకోవచ్చు.

* స్పోర్ట్స్‌, ఫార్మల్‌ షూస్‌ వీటితో పాటు ధరించకూడదు. లూపర్స్‌, క్యాజువల్‌ షూసే వీటి అందం పెంచుతాయి. సాక్స్‌ వేయొద్దు. 
* పొడవాటి, లూజ్‌గా ఉన్న టీషర్ట్‌లు వేయకూడదు.

* ఫార్మల్‌గా వేసుకోవాలనుకుంటే... స్కిన్‌టైట్‌ షర్ట్‌ వేసి.. జాకెట్‌ ధరిస్తే బాగుంటుంది. షార్ట్‌లెంగ్త్‌ సూటైనా ఆకట్టుకోవచ్చు. 
* టక్‌ చేయాలనుకుంటే... సన్నని బెల్టే నప్పుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని