హృతిక్‌ హోం మంత్ర

బాలీవుడ్‌లో తనో ‘గ్రీక్‌ గాడ్‌’.. కసరత్తులకూ కేరాఫ్‌ అడ్రస్‌.. కండలు పెంచితే హృతిక్‌లానే పెంచాలనేంత ప్రేరణ తను. అంత ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌లా జిమ్‌ చేసే హృతిక్‌ లాక్‌డౌన్‌లో తన ఫిట్‌నెస్‌ మంత్రాని ...

Published : 23 May 2020 00:27 IST

ఫిట్‌నెస్‌..

బాలీవుడ్‌లో తనో ‘గ్రీక్‌ గాడ్‌’.. కసరత్తులకూ కేరాఫ్‌ అడ్రస్‌.. కండలు పెంచితే హృతిక్‌లానే పెంచాలనేంత ప్రేరణ తను. అంత ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌లా జిమ్‌ చేసే హృతిక్‌ లాక్‌డౌన్‌లో తన ఫిట్‌నెస్‌ మంత్రాని అభిమానులతో పంచుకున్నాడు. మీకు తెలుసా? హృతిక్‌ కూడా ఇంటి చిట్కాలనే ఫాలో అవుతున్నాడు. వంటింట్లో క్షణాల్లో అందుబాటులో ఉండే ఆ నాలుగు తప్పనిసరిగా తన డైట్‌లో భాగమవుతున్నాయని చెబుతున్నాడు. మరి, హృతిక్‌ ఫాలో అయ్యే ఆ హోమ్‌ డైట్‌ ఏంటో తెలుసుకుని మీరూ ఫాలో అయిపోండి..


ఇంటి కషాయం

రోగనిరోధక శక్తిని పెంచే ఇంటి కషాయం తన డైట్‌లో తప్పక ఉంటుంది. అల్లం, పసుపుతో తయారు చేసిన కషాయాన్ని రోజూ ఉదయాన్నే సేవిస్తాడు. ఇప్పుడున్న కరోనా కాలానికి రోగ నిరోధక శక్తే ఆయుధం కాబట్టి మీరూ ఇంటి కషాయంతోనే రోజు ప్రారంభించండి.


నీరే ఇంధనం..

దయం, సాయంత్రం తను చేసే కఠోర వ్యాయామానికి అధిక నీళ్లు తాగడం అవసరం అంటాడు హృతిక్‌. ప్రతి రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు శరీరానికి అవసరం అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న వేసవి తీవ్రత, వైరస్‌ దాడుల్ని అడ్డుకోవాలంటే రోగనిరోధక శక్తి మరింత పెంచే శుభ్రమైన నీరే ఆరోగ్య మంత్రం అంటున్నాడు.


కండ బలానికి...

తృణధాన్యాలు, చిక్కుడు, పాలు, పెరుగు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటాడు. కండ బలానికి ప్రొటీన్‌లు అత్యవసరం. అందుకే హృతిక్‌ రోజు మొత్తం డైట్‌ ప్రొటీన్‌లు ఎక్కువగా ఉన్న ఆహారంతోనే సాగుతుంది.


పళ్లు, కూరగాయలు

హృతిక్‌ తన రోజువారీ డైట్‌లో పళ్లు, కూరగాయలు తప్పక ఉండేలా చూసుకుంటాడు. ఆయా కాలాల్లో ప్రకృతి ప్రసాదించే ‘సీజనల్‌ ఫ్రూట్స్‌’ని తీసుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నాడు. అంతేకాదు.. ఫిట్‌గా ఉండాలంటే ఆహార నియమాలతో పాటు రోజూ ఓ గంట పాటైనా వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరం అని చెబుతున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని