వెలుగునిచ్చే హెల్మెట్‌

యూత్‌ చేతిలో బైక్‌ ఉంటే ఊరుకోరుగా! మేఘాల్లో తేలిపోవాల్సిందే. ఇలాంటి సమయంలోనే తలకి రక్షణగా ఉండటానికి హెల్మెట్‌ అత్యవసరం. పైగా ఇప్పుడు శిరస్త్రాణం ధరించకపోతే    భారీ చలానాలు

Published : 13 Mar 2021 00:18 IST

యూత్‌ చేతిలో బైక్‌ ఉంటే ఊరుకోరుగా! మేఘాల్లో తేలిపోవాల్సిందే. ఇలాంటి సమయంలోనే తలకి రక్షణగా ఉండటానికి హెల్మెట్‌ అత్యవసరం. పైగా ఇప్పుడు శిరస్త్రాణం ధరించకపోతే    భారీ చలానాలు కట్టాల్సిందే అనే నిబంధనలు వచ్చాయి. అంత ముఖ్యమైన హెల్మెట్‌లు మార్కెట్లో చాలానే ఉన్నాయి. వీటన్నింటికన్నా భిన్నమైంది కొత్తగా వచ్చిన ‘టార్చ్‌ వన్‌’. దీనికి టార్చ్‌ లైట్లు ఉండటం ప్రత్యేకత. ముందు, వెనక కలిపి నాలుగు ఉంటాయి. 360 డిగ్రీల కోణాల్లో వెలుతురు ప్రసరిస్తుంది. రాత్రి సమయాల్లోనూ సైక్లిస్టులు, బైకర్లు దీన్ని ఎంచక్కా ధరించవచ్చు. పైగా ఇది వాటర్‌ రెసిస్టెంట్‌ కూడా. ఈ లైట్లు విద్యుత్తు బ్యాటరీతో పని చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని