బ్యాగులోనే ఛార్జింగ్‌

క్రాస్‌బాడీ బ్యాగులు అమ్మాయిలు, అబ్బాయిలకు స్టైల్‌ ఐకాన్లు. ఇవే మన స్మార్ట్‌ఫోన్‌ని ఛార్జింగ్‌ చేసే వపర్‌బ్యాంకులైతే

Published : 27 Mar 2021 01:03 IST

క్రాస్‌బాడీ బ్యాగులు అమ్మాయిలు, అబ్బాయిలకు స్టైల్‌ ఐకాన్లు. ఇవే మన స్మార్ట్‌ఫోన్‌ని ఛార్జింగ్‌ చేసే వపర్‌బ్యాంకులైతే స్టైల్‌కి స్టైల్‌, మంచి సౌకర్యం కూడా. ‘ది క్వాడ్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ క్రాస్‌బాడీ బ్యాగ్‌’ అలాంటి యాక్సెసరీనే. బయటికెళ్లినప్పుడు, ప్రయాణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది 10,000ఎంఏహెచ్‌ పవర్‌బ్యాంక్‌తో పని చేస్తుంది.  ఈ బ్యాగులో వపర్‌బ్యాంక్‌ ఒకవైపు, సెల్‌ఫోన్‌ మరోవైపు పెడితే చాలు. ఇది వైర్‌లెస్‌. ఎలాంటి కేబుల్స్‌ వాడాల్సిన పని లేదు. వాటర్‌ప్రూఫ్‌ కావడంతో తడుస్తుందనే ఇబ్బంది కూడా లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని