పరుగు నచ్చదట
అందం సూపర్.. నటన భేష్.. అనిపించుకునే బాలీవుడ్ భామల్లో హ్యుమా ఖురేషీ ముందుంటుంది. చేసింది కొద్ది సినిమాలే అయినా గుర్తించుకోదగ్గ అభినయం ఈ బొద్దుగుమ్మ సొంతం. ఈమధ్య ఓటీటీల్లో వచ్చిన ‘లీలా’, ‘మహారాణి’ సిరీస్‌లతో ఆకట్టుకుంది. దాంతోపాటు కొన్నాళ్ల కిందట హాలీవుడ్ నుంచి కూడా పిలుపు రావడంతో భారీ యాక్షన్ థ్రిల్లర్ జాంబీ సినిమాలోనూ నటించి మంచి మార్కులే కొట్టేసింది. ‘ఇంత చేస్తున్నా ఈ పేరును ఫేమ్‌గా మలచుకొని స్టార్ ఎందుకు కాలేకపోయావ్?’ అని ట్వీటాడో అభిమాని. ఖురేషీ ఘాటుగానే సమాధానం చెప్పింది. ‘స్టార్‌డమ్ ఓ ర్యాట్ రేస్‌లాంటిది. ఇందులో పాల్గొనడం నాకిష్టం ఉండదు. పోటీలో గెలిచి స్టార్ అయినా అది ర్యాట్ రేస్ కాకుండా పోదుగా’ అంది. ‘నటించడం ఆపేసిన తర్వాత ఓసారి వెనక్కి తిరిగి చూస్తే జనాలకు నా పాత్రలే గుర్తుకు రావాలి. అవి విభిన్నంగా ఉండాలి. అంతే తప్ప తీరిక లేకుండా పని చేయాలనే కోరిక నాకు లేదు’ అని ముక్తాయించింది.
తన నటనకు మార్కులు
*బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు.
* సౌతాఫ్రికన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఉత్తమ నటి.
* సౌత్ ఆసియన్ రైజింగ్ స్టార్.
* ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజెల్స్ ‘స్పెషల్ మెన్షన్’.
* స్టార్ డస్ట్ ఉత్తమ సహాయ నటి.
* నాలుగు ఫిల్మ్‌ఫేర్, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డులకు ఎంపిక.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23