డెమీ..భారత్‌పై ప్రేమ
జగమెరిగిన పాటగత్తె డెమీ లొవాటోకి ప్రపంచంలో ఏ మూలకెళ్లినా అభిమానులుంటారు. తనకి మాత్రం భారత్ అంటే చెప్పలేనంత ప్రేమ. ‘భారతీయ వేదాలంటే నాకు చాలా గౌరవం’ అని చెబుతూ, ఇక్కడి మహిళా సమస్యలపై స్పందిస్తూ..
జగమెరిగిన పాటగత్తె డెమీ లొవాటోకి ప్రపంచంలో ఏ మూలకెళ్లినా అభిమానులుంటారు. తనకి మాత్రం భారత్ అంటే చెప్పలేనంత ప్రేమ. ‘భారతీయ వేదాలంటే నాకు చాలా గౌరవం’ అని చెబుతూ, ఇక్కడి మహిళా సమస్యలపై స్పందిస్తూ.. చాలా సందర్భాల్లో ఆ ఇష్టాన్ని చాటుకుంటూనే ఉంది. ఈసారి ఆ అభిమానాన్ని తన షో ద్వారా చాటుకుంది. ‘4 డీ విత్ డెమీ లొవాటో’ అనే పాపులర్ యూట్యూబ్ షో నిర్వహిస్తుంటుంది తను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలెబ్రెటీలను ఎంచుకొని ఈ టాక్ షోలో పలు విషయాలు మాట్లాడుతుంది. ఈసారి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు సద్గురును ఆహ్వానించింది. మనిషిలోని అంతర్గత ఆనందం, ఆధ్యాత్మికం, పర్యావరణం, మోటార్‌సైకిళ్లతో ఆయనకి ఉన్న అనుబంధం.. ఇలా పలు అంశాలపై చర్చ జరిగింది. నలభై నిమిషాల ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. ‘చర్చని మరోస్థాయికి తీస్కెళ్లారు. ఇంకోసారి సద్గురుతో షో చేయాలి’ అని ఒకరంటే.. ‘పాశ్చాత్యం, ఆధ్యాత్మికం కలయిక అద్భుతం’ అని మరొకరు కామెంట్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్