ఇంట్లోనే ఫిట్‌హిట్‌

ఫిట్‌గా ఉండటం కుర్రకారు కల. కానీ జిమ్‌కెళ్లడం కొందరికి నచ్చదు. బయటికెళ్లాలంటే బద్ధకం. అన్నింటికీ మించి ఇప్పుడు పరిస్థితులేం బాగా లేవు. అలాంటివాళ్లు ఇంట్లోనే, తక్కువ స్థలంలోనే చేయదగ్గ కొన్ని తేలికైన వ్యాయామాలివి....

Published : 28 Aug 2021 01:12 IST

ఫిట్‌గా ఉండటం కుర్రకారు కల. కానీ జిమ్‌కెళ్లడం కొందరికి నచ్చదు. బయటికెళ్లాలంటే బద్ధకం. అన్నింటికీ మించి ఇప్పుడు పరిస్థితులేం బాగా లేవు. అలాంటివాళ్లు ఇంట్లోనే, తక్కువ స్థలంలోనే చేయదగ్గ కొన్ని తేలికైన వ్యాయామాలివి.

లాంజెస్‌: తుంటి బలపడటానికి ఇది మంచి వ్యాయామం. చిన్న మ్యాట్‌ వేసుకొని దానిపైనే వర్కవుట్‌ చేయొచ్చు. తుంటి, మోకాలు కదలికలు బాగుండటానికి, కండరాలు బలపడటానికి ఈ వర్కవుట్‌ సహకరిస్తుంది. దీని ప్రభావంతో లోయర్‌ బాడీ మొత్తానికి వ్యాయామం అందుతుంది.

జంపింగ్‌ స్కాట్స్‌: ఇంట్లోనే చేసుకోదగ్గ హై-ఇంటెన్సిటీ వర్కవుట్‌ ఇది. కాలి నుంచి పిరుదుల వరకు మంచి శరీరాకృతి రావడానికి, కండరాలు దృఢం కావడానికి ఈ వ్యాయామం తోడ్పడుతుంది. పిక్కలు, వీపు భాగానికి సైతం ప్రయోజనాలుంటాయి.

పుషప్స్‌: కాళ్లు, చేతులు నేలకు ఆనించి శరీర బరువునంతా వాటిపై మోపి చేసే వ్యాయామం. ఇది తరచూ చేస్తుంటే శరీరానికి ఆక్సిజన్‌ శాతం బాగా అందుతుంది. ఈ వర్కవుట్‌ చేస్తున్నప్పుడు గట్టిగా గాలి పీల్చి ఒక్క క్షణం ఆగి వదులుతుండాలి.

మౌంటెయిన్‌ క్లైంబర్స్‌: ఇది టోటల్‌ బాడీ వర్కవుట్‌. కార్డియో వ్యాయామం కూడా. మెడ నుంచి కాలి వరకు ప్రతి జాయింట్‌, కండరంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ట్రైసెప్‌, కండరాలు, వీపు, తొడలు.. దృఢమవుతాయి.

స్కిప్పింగ్‌: ఇది పూర్తి బాడీ వర్కవుట్‌. శరీరంలో చురుకుదనం, స్థిరత్వం, సమన్వయం మెరుగు పడటానికి ఎంతో ఉపకరిస్తుంది.

సస్పెన్షన్‌ పులప్స్‌: ఇంటి గోడ, చెట్టు.. దేనికైనా సస్పెన్షన్‌ బ్యాండ్స్‌ తగిలించి రో, గెటప్స్‌, మాడిఫైడ్‌ పులప్స్‌ చేయొచ్చు. వీపు పైభాగం, భుజాలు, చేతులు దృఢమవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని