చిరుపుస్తకం.. ప్రాణప్రదం

జీవితంలో తీవ్ర కలతలతో కుంగిపోయిన ఓ యువకుడు ఇక మరణమే శరణ్యమని నిర్ణయించుకున్నాడు. నిర్వేదంతో దిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. స్టేషన్‌లో సుదీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న ఆ యువకుడికి అల్లంత దూరాన బుక్‌స్టాల్‌లో

Published : 12 Jan 2019 00:20 IST

చిరుపుస్తకం.. ప్రాణప్రదంజీవితంలో తీవ్ర కలతలతో కుంగిపోయిన ఓ యువకుడు ఇక మరణమే శరణ్యమని నిర్ణయించుకున్నాడు. నిర్వేదంతో దిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. స్టేషన్‌లో సుదీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న ఆ యువకుడికి అల్లంత దూరాన బుక్‌స్టాల్‌లో ఓ చిన్న పుస్తకం కనిపించింది. జేబులో మిగిలిన పావలాతో ఆ పుస్తకాన్ని కొన్నాడు.. ఒక్క పేజీ తిరిగేయగానే ఆయనలో ఎక్కడలేని ఉత్తేజం నిండిపోయింది. ఏదో మంత్రశక్తి ఆవహించినట్టు ఆ పుస్తకంలోని ఒక్కో సూక్తి ఆయనకు ఎంతో ప్రేరణను ఇచ్చాయి. చావు తప్ప మరోమార్గం లేదనుకున్న ఆయనను పల్లె వైపు పరుగులు పెట్టించింది ఆ పుస్తకం. మరణం అంచువరకూ వెళ్లిన ఆ వ్యక్తిని కార్యశీలిగా, ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దిన చిరుపొత్తమే ‘వివేకానంద.. హిజ్‌ కాల్‌ టు ది నేషన్‌’ (భారతజాతికి నా హితవు). ఆ యువకుడే ప్రముఖ సామాజికవేత్త  అన్నా హజారే..! ఈ పుస్తకంలోని అద్భుతమైన సూక్తుల్లో ..
‘‘20 వేల టన్నుల వ్యర్థమైన మాటలకన్నా.. ఇసుమంత ఆచరణ మిన్న’’
(ఈ అరుదైన చిన్న పుస్తకం హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో రూ.9 (ఆంగ్లం), రూ.10 (తెలుగు) అందుబాటులో ఉంది)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని