బంతితో భళే రికార్డు

పరీక్షలప్పుడు పుస్తకం పట్టాలంటేనే బద్ధకం. నాలుగు రోజులు వరుసగా వ్యాయామం చేద్దామంటే ఓపిక ఉండదు. లఖ్‌నవూ కుర్రాడు హసన్‌ అక్సరీ మాత్రం లక్ష్యం కోసం రెండేళ్లలో ఒక్కరోజు కూడా తప్పకుండా సాధన చేశాడు.

Updated : 05 Mar 2022 00:21 IST

పరీక్షలప్పుడు పుస్తకం పట్టాలంటేనే బద్ధకం. నాలుగు రోజులు వరుసగా వ్యాయామం చేద్దామంటే ఓపిక ఉండదు. లఖ్‌నవూ కుర్రాడు హసన్‌ అక్సరీ మాత్రం లక్ష్యం కోసం రెండేళ్లలో ఒక్కరోజు కూడా తప్పకుండా సాధన చేశాడు. ఫలితం.. ప్రపంచరికార్డు అతడి పాదాక్రాంతమైంది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో అతడి పేరు చోటు చేసుకుంది. ఇంతకీ తన రికార్డు ఏంటంటే.. మోకాలిపై ఆరు నిమిషాల, 16.98 సెకన్లపాటు ఫుట్‌బాల్‌ని నిలబెట్టడం. దీంతో అత్యధిక సమయం ఈ ఫీట్‌ చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

కాలేజీలో చేరినప్పటి నుంచే అందరికంటే భిన్నంగా ఉండాలని తపించిపోయేవాడు హసన్‌. అదే లక్ష్యంతో అంతర్జాలాన్ని గాలిస్తుంటే మోకాలిపై బంతి నిలబెట్టే రికార్డు గురించి తెలిసింది. దాన్ని బద్ధలు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. కానీ అది అనుకున్నంత సులువేం కాలేదు. మొదట్లో బంతిని మోకాలిపై పెట్టిన కొద్ది సెకండ్లకే జారిపోయేది. లక్ష్యం చేరాలంటే ఫిట్‌గా ఉండాలని అర్థమైంది. వ్యాయామ ఉపాధ్యాయుడి సలహాలు తీసుకున్నాడు. ఆహార నియమాలు పాటించాడు. ఒక్కరోజు కూడా తప్పకుండా రెండేళ్లకుపైగా సాధన చేసి చివరకు రికార్డు సాధించాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని