సందర్భానికి షూటబుల్‌గా..
డ్రెస్‌లు ఎన్ని ఉన్నా... గాగుల్స్ ఎన్ని రకాలుగా వార్డ్‌రోబ్‌ను అలంకరించినా... వేసుకొనే షూస్ ఎలా ఉండాలనేది ప్రతి ఒక్కరికీ సమస్యే. దీన్ని అధిగమించడానికి ఫ్యాషన్ నిపుణులు మన దగ్గర కచ్చితంగా ఈ నాలుగు రకాల షూస్ ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు. ఎలాంటి పార్టీలకైనా, ఎలాంటి ఫంక్షన్లలోనైనా ఈ నాలుగింటిలో ఏదో ఒకటి మనల్ని ప్రత్యేకంగా నిలుపుతాయని చెబుతున్నారు. అందుకే యూత్ వార్డ్‌రోబ్‌లో ఈ నాలుగు రకాల షూస్‌ను ఉంచుకోమంటున్నారు. ఎప్పుడు ఏది వేసుకోవాలో నిర్ణయించుకుంటే అందరిలోనూ ట్రెండీగా ఉండొచ్చంటున్నారు.
బ్లాక్ ఆక్స్‌ఫర్డ్
ఇప్పటికే మీ దగ్గర బ్లాక్ ఆక్స్‌ఫర్డ్ ఉంటాయి. వీటిని ఫార్మల్ మీటింగ్స్, ఆఫీసులకు వాడుకోవచ్చు. ఎంత శుభ్రంగా ఉంచుకుంటామనే దానిపై వీటి అందం ఆధారపడి ఉంటుంది.
చెల్సీ బూట్స్
ఇవి అఫీషియల్‌గానూ, క్యాజువల్‌గానూ ఉపయోగపడతాయి. రిచ్ లుక్ ఇస్తాయి. బ్రౌన్ లెదర్‌లో మన పాదాలకు రెట్టింపు అందాన్ని తెస్తాయి.
రన్నింగ్ స్నీకర్స్
వీటిల్లో కొత్త డిజైన్స్ మీ దగ్గర ఉంటే స్పోర్ట్స్ లుక్‌లో మీరు అప్‌డేట్ అయినట్లే. జీన్స్, టీషర్ట్స్‌లపైకి ఇవి ఎంతో అదనపు హంగును ఇస్తాయి.
సూడ్ లూఫర్స్
క్యాజువల్ పార్టీలకు వెళ్లేటప్పుడు ఇవి ఎంతగానో ఆకట్టుకుంటాయి. జీన్స్, టీషర్ట్స్‌ల పైకి మంచి లుక్ ఇస్తాయి. ఫ్రెండ్స్‌తో క్యాజువల్ అవుటింగ్‌కి వెళ్లడానికి ఇవి సరిపోతాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక