నలుగురుమెచ్చే స్టైల్‌..

వాడు కిర్రాక్‌.. డ్రెస్‌ వేశాడంటే  ఓ రేంజ్‌లో ఉండాల్సిందే... వీడొట్టి సింపుల్‌ మ్యాన్‌ కొంచెం కూడా స్టైల్‌ తెలియదు...

Published : 15 May 2021 00:18 IST

వాడు కిర్రాక్‌.. డ్రెస్‌ వేశాడంటే  ఓ రేంజ్‌లో ఉండాల్సిందే... వీడొట్టి సింపుల్‌ మ్యాన్‌ కొంచెం కూడా స్టైల్‌ తెలియదు... కుర్రాళ్లను గురించి ఇలాంటి రకరకాల కామెంట్లు వినబడటం మామూలే. అసలింతకూ స్టైల్‌లో రకాలెన్ని? అంటే...

సింపుల్‌: సౌకర్యానికే ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు సాధారణంగా ఉంటారు. ఉదాహరణకు.. ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉండాలంటే కొంచెం వదులుగా ఉన్న ప్యాంట్‌ వేసుకోవచ్చు లేదా బ్యాగీ ప్యాంట్‌ ధరించవచ్చు. సింపుల్‌ని ఇష్టపడేవాళ్లు మొదటిదానికే ఓటేస్తారు. రెండోది స్టైల్‌కి చిరునామా.

ట్రెండీ: కొత్తగా ఏ స్టైల్‌, ఫ్యాషన్‌ వచ్చినా వదలని అబ్బాయిలు ట్రెండీ. టోపీలు, స్కార్ఫ్‌లు, వాచీలు, బెల్టులు, షూస్‌ల నుంచి ఒంటి మీద వేసుకునే డ్రెస్‌ దాకా అన్నీ స్టైల్‌గా ఉండాలనుకుంటారు. ఒక్క డ్రెస్‌ మాత్రమే కాకుండా జాకెట్స్‌, లేయరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తారు. జీన్స్‌తో ప్రయోగాలు చేస్తారు. కాళ్లకి స్నీకర్లు, లోఫర్స్‌, బైకర్‌ బూట్లు వీళ్ల ఫేవరెట్‌.

బిజినెస్‌: హుందా, దర్పంగా కనపడాలి అనుకునేవాళ్ల స్టైల్‌ ఇది. కార్పొరేట్‌, యువ ఉద్యోగులు ఈ ఫ్యాషన్‌ ఆరాధకులు. కాలర్‌ చొక్కాలు, సాదా రంగులు, మెడలో టై, లోఫర్‌ బూట్లు.. వీరి స్టైల్‌ కోషంట్‌.

ఫార్మల్‌: అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలనుకునే వారి ఛాయిస్‌ ఇది. నలుపు రంగు సూట్లు, టక్సెడోలు, మెడలో టై సహజంగా ఎక్కువగా ధరిస్తుంటారు. కార్పొరేట్‌, ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో ఈ ట్రెండ్‌ని ఫాలో అయ్యేవారు ఎక్కువ. షూలకు తెలుపు రంగు సాక్సులే వేసుకుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని