భాష మనది..భావం వారిది

హాలీవుడ్‌ తారలకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌...వాళ్లకేమో భారతీయ భాష, సంస్కృతులంటే మోజు! తాజాగా పాప్‌ సింగర్‌ మిలీ సైరస్‌ మన హిందీ అక్షరాల్లో  తన ఒంటిపై పచ్చబొట్టుకి చోటిచ్చింది...ఇలా గుండెల్లోని భావాల్ని మన భాషలో టాటూలుగా  వేయించుకున్న స్టార్లు బోలెడు.

Published : 05 Jun 2021 00:42 IST

హాలీవుడ్‌ తారలకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌...వాళ్లకేమో భారతీయ భాష, సంస్కృతులంటే మోజు! తాజాగా పాప్‌ సింగర్‌ మిలీ సైరస్‌ మన హిందీ అక్షరాల్లో  తన ఒంటిపై పచ్చబొట్టుకి చోటిచ్చింది...ఇలా గుండెల్లోని భావాల్ని మన భాషలో టాటూలుగా  వేయించుకున్న స్టార్లు బోలెడు.

డేవిడ్‌ బెక్‌హామ్‌: జగమెరిగిన ఫుట్‌బాల్‌ ఆటగాడు డేవిడ్‌ బెక్‌హాం తన చేతి మణికట్టుపై భార్య విక్టోరియా పేరుని టాటూ వేయించుకొని ప్రేమ చాటుకున్నాడు.
ఏంజెలినా జోలీ: భుజం కిందుగా వీపుపై పాలీ భాషలో పచ్చబొట్టు వేయించుకుంది. మనలో మంచితనం, నిజాయతీ ఉంటే సంతోషం వెన్నంటి వస్తుందనే అర్థం వచ్చేలా ఈ పచ్చబొట్టుతో చాటి చెప్పింది.
వనెస్సా హడ్జెన్స్‌: పాప్‌ సింగర్‌, నటి వనెస్సా రెండు చేతులు కలిపి నమస్కరించినప్పుడు ఓం టాటూ కనిపించేలా డిజైన్‌ వేసుకుంది. పాజిటివ్‌ ఎనర్జీ వ్యాపింపజేయడానికి తనిలా చేశానంటోంది.
కేటీ పెర్రీ: ఈ స్టార్‌ సింగర్‌కి భారత్‌తో అనుబంధం ఎక్కువ. బ్రిటీష్‌ నటుడు రసెల్‌ బ్రాండ్‌ని ఉదయ్‌పూర్‌ రాజసౌధంలో పెళ్లాడింది. అప్పుడే ఇద్దరూ తమ కుడి చేతిపై ‘అను:ఘచ్చతు ప్రవాహ’ అని టాటూ వేయించుకున్నారు. అంటే ప్రవాహంతో కలిసి ముందుకు వెళ్లిపోవాలని దానర్థం.

మిలీ సైరస్‌: టీనేజీ సంచలనం, పాప్‌ సింగర్‌ మిలీ సైరస్‌ ఎడమ చేతి మణికట్టుపై  సంస్కృతంలో ‘ఓం’ రాయించుకుంది.
రిహానా: భగవద్గీతలోని 10.4-5 శ్లోకాన్ని నడుము కుడివైపు నుంచి కిందివరకు హిందీలో టాటూ వేసుకుంది. పవిత్రమైన శ్లోకాన్ని ఆ ప్రదేశంలో వేయించుకోవడమేంటని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
జెస్సికా ఆల్బా: సంస్కృతంలో ‘పద్మ’ అని తన కుడి చేతి మణికట్టుపై రాసుకుంది. సరస్సులో, మురికి గుంటలో ఎక్కడ వికసించినా పద్మం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అలాగే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మంచితనం, నిజాయతీ చూపాలని తన ఉద్దేశం.
* నటి అలిస్సా మిలానో ‘ఓం’, సింగర్‌ కింబర్లీ వ్యాట్‌ లోకా సమస్తా సుఖినోభవంతు’ మెడకింద, ఫుట్‌బాలర్‌ థియో వాల్కట్‌ కుడిచేతి మణికట్టుపై ఓం నమ:శివాయ అని రాయించుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని