బైకంటే.. ప్రేమంట
బండిని గాళ్‌ఫ్రెండ్‌లా భావించే కుర్రాళ్లుంటారు. బెస్టీలా చూసే అబ్బాయిలూ కనిపిస్తారు. ‘ద్విచక్రవాహనంతో యువతకి ఎందుకింత అనుబంధం?’ అని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ దేశంలోని ఆరు నగరాల్లో అధ్యయనం చేసింది. వాళ్లేం చెప్పారంటే..
వేగం: మోటార్‌సైకిళ్లలో కుర్రకారుని అత్యధికంగా ఆకట్టుకునేది వేగం. కళ్లు మూసి తెరిచేలోగా వంద కిలోమీటర్ల వేగం అందుకోవడం వాళ్లకి కావాలి. గాల్లో తేలిపోతుంటే.. వాళ్లు పొందే అనుభూతి మరెక్కడా దొరకదట. అందుకే వేగం, మేటి పికప్ ఉన్నవాటినే ఇష్టపడుతున్నారు.
స్టైల్: బడ్జెట్ చిన్నదైనా, పెద్దదైనా.. కుర్రాళ్లు ఉన్నంతలో ఆకర్షణీయంగా ఉండే బైక్‌ని కోరుకుంటున్నారట. రూపం నచ్చితే మైలేజీ, ధర విషయంలోనూ రాజీ పడతాం అంటున్నారు.
శబ్దం: ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బండి ఇంజిన్, ఎగ్జాస్ట్ నుంచి వెలువరించే శబ్దం నచ్చితే చాలు.. దాన్ని కొనుక్కునే యూత్‌కి లెక్కేలేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘బుల్లెట్’, బజాజ్ ‘పల్సర్’ మోడళ్లు ఇలా పల్స్ పట్టినవేనట.
పోజు: తమ యాటిట్యూడ్ చూపించుకోవడానికి అనువుగా ఉండేది బైక్ అనే నమ్ముతున్నారు చాలామంది. రివ్వున దూసుకెళ్తూ పోజు కొట్టడానికి, రోడ్డుపై ‘అన్నీ’ కవర్ చేయడానికి బెస్టీలను వెనకేసుకొని తిరగడానికి ద్విచక్రవాహనం కారుకన్నా అనుకూలమని వారి అభిప్రాయం.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM KCR: తెలంగాణలో భూసమస్యల పరిష్కారానికి మండలాల్లో రెవెన్యూ సదస్సులు
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
-
Business News
matrimony: ఐఏఎస్, ఐపీఎస్ కాదట.. మ్యాట్రీమొనీ సైట్లో వెతికింది వీరి కోసమేనట..!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
YS Sharmila: తెరాస కార్యకర్తలను అరెస్టు చేయాల్సిందే.. జోరువానలో షర్మిల దీక్ష
-
Sports News
PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!