ప్రేమంటే సులువు సోదరా...!

గడ్డం పెంచడం.. విషాద గీతాలు పాడుకోవడం.. జీవితాంతం ఏడవడం.. ప్రేమలో ఫెయిలైతే ఇంతేనంటారా? అంత దృశ్యం లేదు బాస్‌. ఇప్పటివాళ్లు ప్రేమను మరీ అంత సీరియస్‌గా ఏమీ తీసుకోవడం లేదు.

Published : 11 Feb 2023 00:16 IST

గడ్డం పెంచడం.. విషాద గీతాలు పాడుకోవడం.. జీవితాంతం ఏడవడం.. ప్రేమలో ఫెయిలైతే ఇంతేనంటారా? అంత దృశ్యం లేదు బాస్‌. ఇప్పటివాళ్లు ప్రేమను మరీ అంత సీరియస్‌గా ఏమీ తీసుకోవడం లేదు. ఎంటీవీ ఇండియా ఈమధ్యే చేసిన అధ్యయనంలో వాళ్లు చెప్పిన సంగతులు వింటే ఔను అనకుండా ఉండలేం.

 * వలచిన చెలికాడు, మనసు పడ్డ చిన్నదాని కోసం ప్రాణాలైనా ఇస్తాం.. ఎంతదాకైనా వెళ్తాం అని మనస్ఫూర్తిగా చెప్పింది పదమూడు శాతమే.
 తమ ప్యార్‌, ఇష్క్‌, కాదల్‌ గురించి ఇంట్లో నిర్భయంగా చెప్పిన లవర్స్‌ 12శాతమే. అందులోనూ సగం మందే కన్నవాళ్లు ఒప్పుకోకపోయినా మేం పెళ్లికి సిద్ధం అన్నారు.
 * ప్రేమించేవాళ్లు మనసుకి నచ్చాలి.. పవిత్రంగా ఉండాలి.. జీవితాంతం కలిసి ఉండాలి.. అని మేం కోరుకోవడం లేదు. మా ప్రేమలో రొమాన్సూ ఉండాలి.. నచ్చకపోతే తేలిగ్గా బ్రేకప్‌ చెప్పుకోవాలి అన్నవాళ్లు సగం కన్నా ఎక్కువే.
 * నలుగురిలో ముగ్గురికి తమ ప్రేమ పెళ్లిపీటలకెక్కుతుందనే నమ్మకమే లేదట. ప్రేమించిన అమ్మాయి/అబ్బాయిని కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని సెలవిచ్చారు.
 * కుర్రకారుకు ప్రేమే లోకం అనుకుంటాం. కానీ చిత్రంగా ప్రేమలో ఉన్నవాళ్లలో 46 శాతం మంది ప్రేమ కన్నా డబ్బుకే మా ప్రాధాన్యం అన్నారు.
హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు, దిల్లీ సహా.. 26 నగరాల్లోని 26 వేల మంది 15 నుంచి 25 ఏళ్ల వయస్కులతో  ఈ అధ్యయనం నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు