కరేబియన్‌ ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు గీతిక

అమెరికా మహిళా క్రికెట్‌లో ప్రతిభ కనబరిచిన తెలుగు యువతి గీతిక కొడాలికి కరేబియన్‌ ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడే అవకాశం లభించింది. వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ లీగ్‌లో గీతికతోపాటు మరో ఇద్దరికి

Published : 18 Aug 2022 04:56 IST

ఈనాడు, అమరావతి: అమెరికా మహిళా క్రికెట్‌లో ప్రతిభ కనబరిచిన తెలుగు యువతి గీతిక కొడాలికి కరేబియన్‌ ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడే అవకాశం లభించింది. వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ లీగ్‌లో గీతికతోపాటు మరో ఇద్దరికి అవకాశం దక్కింది. ఆగస్టు 24నుంచి సెప్టెంబరు 4వరకు సెయింట్‌కిట్స్‌లో జరిగే సిక్ట్సీ మ్యాచ్‌లోనూ వీరు ఆడనున్నారు. సెప్టెంబరులో జరిగే ఐసీసీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ బృందానికి కూడా గీతిక ఎంపికయ్యారు. ఇటీవల అమెరికా అండర్‌-19 టీ20 హోం సిరీస్‌లో గీతిక నేతృత్వంలోని బృందం చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం ఐదు మ్యాచ్‌లలో నాలుగింట గెలుపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని