పీజీ మెడికల్‌ ప్రవేశాలపై అభ్యంతరాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్‌ డిగ్రీ/డిప్లొమా సీట్ల ప్రవేశాలపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సోమవారం వెల్లడించిన సీట్ల కేటాయింపుల్లో ఓసీ కేటగిరీ వారికి అన్యాయం జరిగిందని పలువురు మంగళవారం విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయానికి వచ్చారు.

Published : 05 Oct 2022 03:45 IST

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్‌ డిగ్రీ/డిప్లొమా సీట్ల ప్రవేశాలపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సోమవారం వెల్లడించిన సీట్ల కేటాయింపుల్లో ఓసీ కేటగిరీ వారికి అన్యాయం జరిగిందని పలువురు మంగళవారం విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయానికి వచ్చారు. సీట్‌మ్యాట్రిక్స్‌లో ఓసీ కేటగిరీకి రావాల్సిన సీట్లను రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేయడం ఏమిటని కౌన్సెలింగ్‌ అధికారులను ప్రశ్నించారు. ఏటా తమకు అన్యాయం జరుగుతున్నా విశ్వవిద్యాలయం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీ మెడికల్‌ విభాగంలో సర్వీస్‌ కేటగిరీలో 266, నాన్‌-సర్వీస్‌ విభాగంలో 822 సీట్లను సోమవారం విశ్వవిద్యాలయం భర్తీ చేసింది. వీటిలో దాదాపు 100కి పైగా ఓసీ కేటగిరీకి రావాల్సిన సీట్లు రిజర్వేషన్‌ అభ్యర్థులకు కేటాయించడం ఎంత వరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు సమాధానమిస్తూ జీవో నంబరు 57 ప్రకారం మెరిటోరియస్‌ రిజర్వేషన్‌ (ఎం.ఆర్‌.సి.) కలిగిన అభ్యర్థులు ఓపెన్‌ కేటగిరీలో సీటు తీసుకొని, ఆ తర్వాత రిజర్వేషన్‌ కేటగిరీ కౌన్సెలింగ్‌లో వేరే కళాశాలలో స్లైడింగ్‌కి వెళితే, ఆ సీటు అదే రిజర్వేషన్‌ కేటగిరీకి వెళుతుందని పేర్కొన్నారు. అలా ఓపెన్‌ కేటగిరీలో రిజర్వేషన్‌ అభ్యర్థులు చాలా మంది సీట్లను తీసుకున్నారని, విద్యార్థులు అర్థం చేసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని