XUV700: ఎక్స్‌యూవీ 700కు భారీ సన్‌రూఫ్‌..!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 అన్ని హంగులు కల్పిస్తోంది. మరికొన్ని వారాల్లో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్న ఈ కారుకు

Updated : 06 Jul 2021 20:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహీంద్రా ఎక్స్‌యూవీ700కి అన్ని హంగులు కల్పిస్తోంది. మరికొన్ని వారాల్లో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్న ఈ కారుకు భారీ సన్‌రూఫ్‌ను అమర్చింది. దీనిని స్కైరూఫ్‌గా వినియోగదారులకు పరిచయం చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో 1360 ఎంఎం పొడవు, 870 ఎంఎం వెడల్పుతో ఇదే అతి పెద్దదని పేర్కొంది. ప్రస్తుతం ఎంజీ హెక్టార్‌, జీప్‌ కంపాస్‌, టాటా హారియర్‌, సఫారీ, ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీలకు పనోరమిక్‌ సన్‌రూఫ్‌ లభిస్తోంది. తాజాగా ఈ జాబితాలో ఎక్స్‌యూవీ కూడా చేరనుంది. 

ఈ కారు సెగ్మెంట్లో తొలిసారి పలు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు మహీంద్రా పేర్కొంది. కారులో మెర్సిడెస్‌ కార్లలో వినియోగించేలాంటి డ్యూయల్‌ స్క్రీన్‌ సెటప్‌, లెవల్‌ 1 అటానమస్‌ డ్రైవింగ్‌, ఆల్‌ ఎల్‌ఈడీ లైట్లు, ఫ్లష్‌ ఫిట్టింగ్‌ డోర్‌ హ్యాండిల్స్‌, ఎలక్ట్రికల్లీ అడ్జెస్ట్‌బుల్‌ ముందు సీట్లు వంటివి ఉన్నాయి. ఈ కారులో 2.0 లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లను అమర్చవచ్చని భావిస్తున్నారు. మాన్యూవల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడ్‌లలో ఇది లభిస్తుంది. దీనిలో 4డబ్ల్యూడీ డ్రైవింగ్‌ ఆప్షన్‌ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని