Baleno : భారత్‌లోకి సరికొత్త బాలెనో..!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త బాలెనో వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారు లుక్స్‌లో స్వల్పమార్పులు చేసింది.

Published : 23 Feb 2022 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త బాలెనో వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారు లుక్స్‌లో స్వల్పమార్పులు చేసింది. యాంగ్యూలర్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ల వంటి హంగులు కనిపించాయి. ముఖ్యంగా కారులోపల, టెక్‌ విభాగాల్లో కీలక మార్పులు చేసింది.

సరికొత్త బాలెనోలో క్యాబిన్‌ లేఅవుట్‌ను కూడా పూర్తిగా మార్చింది. సరికొత్త డ్యాష్‌ బోర్డులో 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్‌ యూనిట్‌ను అమర్చారు. ఈ కొత్త కారులో 40 రకాల కార్‌ కనెక్టెడ్‌ ఫీచర్లు ఉన్నాయి. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోతోపాటు ఇన్‌బిల్ట్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ను కూడా అమర్చారు. అలెక్సా అసిస్టెన్స్‌, హెడ్‌అప్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 360 వ్యూకెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్‌ ఏసీ వెంట్‌ వంటివి ఉన్నాయి. సరికొత్త మారుతీ సుజుకీ బాలెనోలో 1.2లీటర్‌ వీవీటీ మోటార్‌ ఇంజిన్‌, 5స్పీడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌, ఆటో ట్రాన్స్‌మిషన్‌( ఆప్షనల్‌) ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని