లైఫ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించేందుకు గ‌డువు పెంపు

కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.....

Published : 25 Dec 2020 15:39 IST

కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులందరూ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జీవిత ధృవీకరణ పత్రాన్ని (లైఫ్ స‌ర్టిఫికెట్‌) సమర్పించవచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అంతకుముందు, పెన్షన్ కొనసాగింపు కోసం లైఫ్ సర్టిఫికేట్ నవంబర్లో మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. క‌రోనా కార‌ణంగా పెద్ద వ‌య‌సు వారికి అనారోగ్యం ఏర్ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నందున ఎక్కువ స‌మ‌యాన్ని ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

అయితే 80, అంతకంటే ఎక్కువ వయస్సు గల పింఛనుదారులు 2020 అక్టోబర్ 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు లైఫ్ స‌ర్టిఫెకెట్‌ సమర్పించవచ్చు. ఈ పొడిగించిన కాలంలో, పెన్షన్ పంపిణీ అధికారులు (పిడిఎలు) ద్వారా పెన్షన్ నిరంత‌రాయంగా చెల్లించటం కొనసాగుతుంది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ప్రస్తుత కాలపరిమితిని సడలించాలన్న ప్రభుత్వ నిర్ణయం, వృద్ధులకు పెద్ద ఉపశమనంగా ఉపయోగపడుతుందని సింగ్ అన్నారు.

బ్యాంకుల‌ వద్ద రద్దీని నివారించడానికి ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం అనుమతించిన మేరకు పెన్షనర్ నుంచి లైఫ్ సర్టిఫికేట్ పొందటానికి వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (వి-సిఐపి) ను అనుమ‌తించాల‌ని పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులను కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. పెన్ష‌న‌ర్‌ గుర్తింపును పొంద‌డానికి ప్రత్యామ్నాయ పద్ధతిగా V-CIP ని అనుమతిస్తూ ఆర్‌బీఐ జనవరి 9 న నోటిఫికేషన్ జారీ చేసింది.

పెన్షనర్లు బ్యాంక్ శాఖలను సందర్శించడం ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు, అయినప్పటికీ, పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ల‌ను స‌మ‌ర్పించాల్సిందిగా ప్రోత్సహిస్తోంది. ఇంటి నుంచే సుల‌భంగా దీనిని పూర్తిచేయ‌వ‌చ్చు.

80 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పింఛనుదారులకు నవంబర్ 1 కు బదులుగా అక్టోబర్ 1 నుంచి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి వీలుగా ఈ విభాగం గత సంవత్సరం ఉత్తర్వులు జారీ చేసింది, తద్వారా వారు సాధారణ రద్దీని నివారించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని