యువ‌త‌... పెట్టుబ‌డుల ప్రాధాన్య‌త

ఇప్పుడు ప్ర‌జ‌ల్లో ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న పెర‌గ‌డంతో పెట్టుబ‌డుల్లో వైవిధ్య‌త క‌న‌బ‌రుస్తున్నారు.​​​​​​....

Published : 19 Dec 2020 13:10 IST

ఇప్పుడు ప్ర‌జ‌ల్లో ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న పెర‌గ‌డంతో పెట్టుబ‌డుల్లో వైవిధ్య‌త క‌న‌బ‌రుస్తున్నారు.

మునుప‌టి త‌రాల‌తో పోలిస్తే ప్ర‌స్తుతం స్థిరాస్తి రంగంలో పెట్టుబ‌డుల‌కు ప్ర‌జ‌లు త‌క్కువ‌గా మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు యువ‌త స్థిరాస్తి కంటే ఇత‌ర పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. గృహ రుణం తీసుకొని ఈఎమ్ఐలు చెల్లించ‌డం కంటే ఈక్విటీ ఫండ్ల పెట్టుబ‌డులు మేలు అని భావిస్తున్నారు. గ‌తంలో ఎవ‌రైనా ఆర్థికంగా స్థిర‌ప‌డ్డార‌ని గుర్తించేందుక‌ ఒక ఇళ్లు, కారు, ఉద్యోగం, బ్యాంక్ బ్యాలెన్స్‌ వంటి వాటినే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఒక వ్య‌క్తి వ‌ద్ద ఎంత ఆస్తి ఉన్న‌దాన్ని బ‌ట్టి ఆర్థిక స్థితిని అంచ‌నా వేస్తారు.

అన్నింటికంటే ముఖ్యంగా మ‌న దేశంలో సొంత ఇంటికి చాలా ప్రాధాన్య‌త‌నిస్తారు. అయితే ఇంత‌కుముందు కంటే ఇప్పుడు స్థిరాస్తి కొనుగోళ్ల‌పై ఆలోచ‌న మారింది. ఇత‌ర పెట్టుబ‌డుల‌కు ఆస‌క్తి క‌న‌బరుస్తున్నారు. మ‌రి ఈ మార్పు ఎందుకొచ్చింది అంటే ఉదాహ‌ర‌ణ‌కు కారు లేక‌పోయినా క్యాబ్ బుక్ చేసుకుంటే హాయిగా వెళ్లాల‌నుకుంటున్న ప్రాంతానికి సొంత కారులో వెళ్తున్న‌ట్లుగా వెళ్ల‌వ‌చ్చు. ఇప్పుడున్న యువ‌త ఇందుకే ఇష్ట‌ప‌డుతున్నారు. ఇంత‌కుముందు ప‌రిస్థితితో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న పెరిగింది. అందుకే పెట్టుబ‌డుల విష‌యాల్లో స్థిరాస్తి నుంచి ఈక్విటీల‌కు మారుతున్నారు. కానీ ఇది చాలా నెమ్మ‌దిగా జరుగుతోంది. ఒకేసారి మార్పు రావ‌డం క‌ష్టం కాని కొంత అయితే పెట్టుబ‌డుల ఆలోచ‌న‌లు మారుతున్నాయ‌నేది నిపుణుల అభిప్రాయం. సాంకేతిక‌త సాయంతో ఎక్కువ స‌మాచారం అందుబాటులోకి రావ‌డంతో పెట్టుబ‌డుల నిర్ణ‌యాల‌కు దీనిని ఉప‌యోగించుకున్నారు. కొత్త విష‌యాల‌ను తెలుసుకోవ‌డంతో పాటు అమ‌లు చేస్తున్నారు. ఇలా వ‌చ్చిన‌వే ఆహ‌ర సంబంధిత వ్యాపారాలు ఫుడ్ డెలివ‌రీ, టిక్కెట్ బుకింగ్ యాప్‌ల‌ వంటివి. ఇప్పుడున్న యువ‌త రిస్క్ తీసుకునేందుకు వెనుకాడ‌టం లేదు. స్థిరాస్తికి బ‌దులుగా ఇత‌ర‌ సాధ‌నాల్లో పెట్టుబ‌డులకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. మార్కెట్ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకొని లాభాల‌ను పొందుతున్నారు. స్థిరాస్తి పెట్టుబ‌డుల్లో రాబ‌డికి చాలా ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది అందుకే సుల‌భంగా పెట్టుబ‌డులు చేయ‌గ‌లిగే త్వ‌ర‌గా లాభాల‌న్నిచ్చే ఈక్విటీల‌వైపే వ‌స్తున్నారు. దీంతో మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆగ‌స్ట్ 2009 లో మ్యూచువ‌ల్ ఫండ్ల ఆస్తుల నిర్వ‌హ‌ణ రూ.7.5 ల‌క్ష‌ల కోట్లు కాగా సెప్టెంబ‌ర్ నాటికి ఇది రూ.24 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. అదేవిధంగా యాంఫీ వివ‌రాల ప్ర‌కారం సిప్ పెట్టుబ‌డులు జులై 2018 లో రూ.7,500 కోట్లుగా న‌మోద‌య్యాయి.

ఉద్యోగ అవ‌కాశాలు:

ఇప్పుడున్న ఉద్యోగ‌వ‌కాశాలు కూడా పెట్టుబ‌డుల్లో మార్పుల‌కు కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. చాలా మంది యువ‌త ఇప్పుడు న‌గ‌రాల‌కు త‌ర‌లివ‌స్తున్నారు. ఇత‌ర దేశాల‌కు వెళ్తున్నారు. ఇలాంటివారు స్థిరాస్తి పెట్టుబ‌డుల కంటే మ్యూచువ‌ల్ ఫండ్లు, ఇత‌ర పెట్టుబ‌డుల‌ను ఎంచుకుంటున్నారు. ఉద్యోగం కోసం ఏ ప్రాంతానికి వెళ్లాల్సి వ‌స్తుందో తెలియ‌న‌ప్పుడు ఒక చోట ఇంటిని కొనుగోలు చేయడం స‌రైన నిర్ణ‌యంగా భావించ‌డం లేదు.

బెంగుళూరు వాసి అయిన వ‌రుణ్ భాస్క‌ర్ 27, ఈ-కామ‌ర్స్ సంస్థ‌లో మేనేజ‌ర్‌గా పని చేస్తున్నారు. ఉద్యోగం కోసం రెండేళ్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు ప్రాంతాల‌కు మారారు. ఇప్పుడు బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. గ‌తేడాది నుంచి ఇక్క‌డ పని చేస్తున్నాను. ఆ త‌ర్వాత ఎక్క‌డికి వెళ్లాల్సి వ‌స్తుందో కూడా తెలియ‌దు అని చెప్పారు. అందువ‌ల్ల‌ స్థిరాస్తుల కంటే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో లేదా నేరుగా ఈక్విటీల్లో పెట్టుబ‌డుల‌ను ఎంచుకున్న‌ట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఇంటిని కొనుగోలు చేసే ఆలోచ‌న లేక‌పోయిన‌ప్ప‌టికీ ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి సొంత ఊరిలో ఇంటిని నిర్మించుకోవాల‌ని అనుకుంటున్నాడు.

జీవ‌న శైలి :

ఉద్యోగాల‌తో పాటు మారుతున్న జీవ‌న‌శైలి కూడా ఇందుకు కార‌ణంగా చెప్తున్నారు. పెట్టుబ‌డుల‌కు ఇప్పుడు ప్రాధాన్య‌త మారిపోతుంది. గృహ రుణానికి ఈఎమ్ఐ చెల్లిస్తే ఎలాంటి అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఉండ‌దు. దానికి బ‌దులుగా ఉన్న‌త విద్య కోసం లేదా భ‌విష్య‌త్తు సంప‌ద‌ను రెట్టింప‌చేసే పెట్టుబ‌డుల‌కు మెగ్గుచూపుతున్నారు. ప్ర‌స్తుతం సౌక‌ర్య‌వంతంగా ఉండేలా చూసుకుంటున్నారు.

ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌టం:

చివ‌ర‌గా, ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌టంతో కూడా ఇంటి కొనుగోలుకు ఆలోచిస్తున్నారు. గ‌త నాలుగైదేళ్ల‌లో ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావంతో స్థిరాస్తి పెట్టుబడులు ప్ర‌తికూల ఫ‌లితాల‌నిస్తున్నాయి. అంత ఎక్కువ డ‌బ్బు పెట్టేందుకు ఇష్టంలేనివారు ఇంటి కొనుగోలుపై ఆస‌క్తి చూప‌డం లేదు. అందుకే మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు స్థిరాస్తి ధ‌ర‌లు స్థిరంగా ఉంటాయ‌ని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని