ప‌ద‌వీవిర‌మ‌ణ నిధి - ఎప్పుడు? ఎంత‌? ఎంత‌కాలానికి స‌మ‌కూర్చుకోవాలి

గౌర‌వ‌నీయ‌ ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితానికి సంపాద‌న ప్రారంభ‌మైన తొలి రోజుల నుంచే మ‌దుపు చేయాలి....

Published : 19 Dec 2020 14:14 IST

గౌర‌వ‌నీయ‌ ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితానికి సంపాద‌న ప్రారంభ‌మైన తొలి రోజుల నుంచే మ‌దుపు చేయాలి

భార‌త‌దేశంలో అతికొద్ది ఫించ‌ను ప‌థ‌కాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. జ‌న‌వ‌రి 2004 తరువాత ఉద్యోగంలో చేరిన ప్ర‌భుత్వ ఉద్యోగులు, సెప్టెంబ‌రు 2009 త‌రువాత చేరిన రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌హితం, వారి ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం వారే కాంట్రీబ్యూట్ చేసుకోవాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత‌ జీవితానికి కావ‌ల‌సిన క్ర‌మ ఆదాయం కోసం వారి ఈపీఎఫ్ కాంట్రీబ్యూష‌న్ స‌రిపోతుంద‌ని చాలామంది బావిస్తుంటారు. కానీ నిజానికి రోజు రోజుకి పెరుగుతున్న జీవ‌న వ్య‌యం, వైద్య ఖ‌ర్చులు కార‌ణంగా ఇది స‌రిపోదు. కొంత మంది, స్వ‌ల్ప‌కాల అవ‌స‌రాల‌కు ఈపీఎఫ్ మొత్తాన్ని, పూర్తిగా గాని, పాక్షికంగా గాని విత్‌డ్రా చేస్తుంటారు. ప్రభుత్వ నిబంధనలకు లోబ‌డి కాలానుగుణంగా విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల‌ పదవీ విరమణ కార్పస్‌లో కొంత కొరత ఏర్ప‌డుతుంది. కాబ‌ట్టి విత్‌డ్రా చేసుకోవ‌డం మంచిది కాదు. దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌తో మాత్ర‌మే కాంపౌండ్ వ‌డ్డీ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చాలా మంది ఉద్యోగులు, వారి సంపాద‌నలో చాలా బాగం పిల్ల‌ల విద్య‌/ వివాహం, గృహ కొనుగోలు, కుటుంబ ఖ‌ర్చులు, సామాజిక కార్య‌క్ర‌మాల‌కు వినియోగించ‌డం వ‌ల్ల, ఈపీఎఫ్‌ త‌ప్ప మ‌రి ఏ ఇత‌ర ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్పాటుచేసుకోరు.

ఈ కింది అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత ఖ‌ర్చుల‌కు ఎంత నిధి అవ‌స‌ర‌మ‌వుతందో ఈ కింది ప‌ట్టిక‌ల‌లో చూద్దాం

  1. ప్ర‌స్తుత నెల‌వారీ ఖ‌ర్చులు.
  2. ఇప్ప‌టి నుంచి ఎన్ని సంవ‌త్స‌రాల త‌రువాత ప‌ద‌వీవిర‌మ‌ణ చేయాల‌నుకుంటున్నారు.
  3. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత ఎన్ని సంవత్సరాలకు ఆదాయం అవ‌స‌రం.
  4. ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌ర నిధిపై అంచనా వేసిన వడ్డీ 8 శాతం
  5. ద్రవ్యోల్బణం 6 శాతం.

ఈ కింది ఏ నుంచి డీ వ‌ర‌కు వున్న ప‌ట్టిక‌ల నెల‌వారీ ఖ‌ర్చుల ఆదారంగా రూపొందించ‌బ‌డ్డాయి.

ఉదాహ‌ర‌ణ‌:1 ప‌ట్టిక ఏ(నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 10 వేలు(వార్షిక ఖ‌ర్చులు రూ. 1.20 ల‌క్ష‌లు)):

అతుల్ నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 10 వేలు( వార్షికంగా రూ. 1.20 ల‌క్ష‌లు) ఈ రోజు నుంచి 10 సంవ‌త్స‌రాల త‌రువాత రిటైర్ అవ్వాల‌నుకుంటున్నాడు. అత‌నికి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం 10 సంవ‌త్స‌రాల జీవితానికి విర‌మ‌ణ నిధి కావాలి. ద్ర‌వ్యోల్భ‌ణం 6 శాతంగా తీసుకుంటే 10 సంవ‌త్స‌రాల త‌రువాత వార్షిక ఖ‌ర్చులు రూ. 2,14,902.
8 శాతం రాబ‌డి, 6 శాతం ద్ర‌వ్యోల్భ‌ణ ప్ర‌భావంతో రూ. 19.78 ల‌క్ష‌ల ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి అవ‌స‌రం అవుతుంది.

EXP-LIFE-A.jpg

ఉదాహ‌ర‌ణ‌:2 ప‌ట్టిక బీ (నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 15 వేలు( వార్షిక ఖ‌ర్చులు రూ. 1.80 ల‌క్ష‌లు) )

రాజేష్‌ నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 15 వేలు( వార్షికంగా రూ. 1.80 ల‌క్ష‌లు) ఈ రోజు నుంచి 20 సంవ‌త్స‌రాల త‌రువాత రిటైర్ అవ్వాల‌నుకుంటున్నాడు. అత‌నికి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం 15 సంవ‌త్స‌రాల జీవితానికి విర‌మ‌ణ నిధి కావాలి. ద్ర‌వ్యోల్భ‌ణం 6 శాతంగా తీసుకుంటే 20 సంవ‌త్స‌రాల త‌రువాత వార్షిక ఖ‌ర్చులు రూ. 5,77,284.
8 శాతం రాబ‌డి, 6 శాతం ద్ర‌వ్యోల్భ‌ణ ప్ర‌భావంతో రూ. 76.22 ల‌క్ష‌ల ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి అవ‌స‌రం అవుతుంది.

EXP-LIFE-B.jpg

ఉదాహ‌ర‌ణ‌:3 ప‌ట్టిక సీ(నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 20 వేలు ( వార్షిక ఖ‌ర్చులు రూ. 2.40 ల‌క్ష‌లు))

శ‌ర‌త్ నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 20 వేలు( వార్షికంగా రూ. 2.40 ల‌క్ష‌లు) ఈ రోజు నుంచి 25 సంవ‌త్స‌రాల త‌రువాత రిటైర్ అవ్వాల‌నుకుంటున్నాడు. అత‌నికి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం 15 సంవ‌త్స‌రాల‌ జీవితానికి విర‌మ‌ణ నిధి కావాలి. ద్ర‌వ్యోల్భ‌ణం 6 శాతంగా తీసుకుంటే 25 సంవ‌త్స‌రాల త‌రువాత వార్షిక ఖ‌ర్చులు రూ. 10,30,049.
8 శాతం రాబ‌డి, 6 శాతం ద్ర‌వ్యోల్భ‌ణ ప్ర‌భావంతో రూ. 1.36 కోట్ల‌ ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి అవ‌స‌రం అవుతుంది.

EXP-LIFE-C.jpg

ఉదాహ‌ర‌ణ‌:4 ప‌ట్టిక డీ (నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 25 వేలు (వార్షిక ఖ‌ర్చులు రూ. 3.00 ల‌క్ష‌లు))

క‌ర‌ణ్‌ నెల‌వారీ ఖ‌ర్చులు రూ. 25 వేలు( వార్షికంగా రూ. 3.00 ల‌క్ష‌లు) ఈ రోజు నుంచి 30 సంవ‌త్స‌రాల త‌రువాత రిటైర్ అవ్వాల‌నుకుంటున్నాడు. అత‌నికి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం, 25 సంవ‌త్స‌రాల జీవితానికి విర‌మ‌ణ నిధి కావాలి. ద్ర‌వ్యోల్భ‌ణం 6 శాతంగా తీసుకుంటే 30 సంవ‌త్స‌రాల త‌రువాత వార్షిక ఖ‌ర్చులు రూ. 17,23,047.
8 శాతం రాబ‌డి, 6 శాతం ద్ర‌వ్యోల్భ‌ణ ప్ర‌భావంతో రూ. 3.47 కోట్ల‌ ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి అవ‌స‌రం అవుతుంది.

EXP-LIFE-D.jpg

ముగింపు:
ఇది భ‌విష్యత్తులో అవ‌స‌ర‌మయ్యే అంచ‌నా మాత్ర‌మే. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ముందు ఉన్న జీవిన శైలిని, ప్ర‌మాణాల‌ను నిర్వ‌హిస్తూ గౌర‌వ‌నీయ‌, శాంతియుత‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితాన్ని గ‌డిపేందుకు త‌గినంత నిధి ఉండాలి.

వేగంగా మారుతున్న జాబ్ ప్రొఫైల్స్‌, ఉపాది మార్క‌ట్లో పోటీత‌త్వం పెరుగుతున్న ఈ రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రూ వారి ఆర్థిక విష‌యాల‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించి మంచి కార్ప‌స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్ప‌ర‌చుకునేందుకు ఎన్‌పీఎస్ ఒక మంచి ఎంపిక‌. దీని ద్వారా ఈక్విటీలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. రుసుములు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. యాన్యూటీ విధానం కూడా అందుబాటులో ఉంది. ఇది నెల‌వారీ క‌చ్చిత‌మైన ఆదాయాన్ని ఇస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని