త్వరలోనే క్రిప్టో కరెన్సీల బిల్లు

ప్రస్తుతం ఉన్న చట్టాలు క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించేందుకు సరిపోవని, అందుకే త్వరలో ప్రత్యేక బిల్లును ప్రభుత్వం

Published : 10 Feb 2021 01:35 IST

కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

దిల్లీ: ప్రస్తుతం ఉన్న చట్టాలు క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించేందుకు సరిపోవని, అందుకే త్వరలో ప్రత్యేక బిల్లును ప్రభుత్వం తీసుకురాబోతోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. ‘క్రిప్టో కరెన్సీలు సాధారణ కరెన్సీ, ఆస్తులు, సెక్యూరిటీలు, కమొడిటీలు కాకపోవడంతో వాటిని నేరుగా నియంత్రించడానికి నియంత్రణ సంస్థలైన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), సెబీల వద్ద ఎలాంటి న్యాయపరమైన నిబంధనలు (లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌) లేవు. అందుకే ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి వర్చువల్‌ కరెన్సీలకు సంబంధించి నివేదిక రూపొందించింది. ఎంపవర్డ్‌ టెక్నాలజీ గ్రూప్‌తో సమావేశం కూడా నిర్వహించాం. మంత్రిమండలి కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల కమిటీ కూడా ఒక నివేదిక అందించింది. వీటిని క్రోడీకరించి క్రిప్టో కరెన్సీలకు ఒక బిల్లును రూపొందించాం. దీన్ని త్వరలోనే మంత్రివర్గం ముందు ఉంచి, తరవాత బిల్లు రూపంలో తీసుకొస్తామ’ని ఠాకూర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని