Anand Mahindra: క్రిప్టోలో ఒక్క రూపాయీ పెట్టుబడి పెట్టలేదు: ఆనంద్‌ మహీంద్రా

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా క్రిప్టో కరెన్సీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్తలు

Updated : 20 Nov 2021 17:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా క్రిప్టో కరెన్సీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. తాను క్రిప్టోల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే.. 

క్రిప్టో కరెన్సీలో ఆనంద్‌ మహీంద్రా పెట్టుబడులు పెట్టారని.. అంతేగాక, వీటి ద్వారా వేగంగా డబ్బు ఎలా సంపాదించాలో సలహాలు కూడా ఇచ్చారంటూ కొన్ని ఆన్‌లైన్‌ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. వీటిపై మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఓ మీడియా కథనాన్ని షేర్‌ చేస్తూ.. అందులోని వార్తను తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది చాలా అనైతికమైనది, ప్రమాదకరమైనది కాకపోయి ఉంటే చాలా వినోదభరితంగా ఉండేది. దీన్ని కొందరు ఆన్‌లైన్‌లో గుర్తించి నన్ను అప్రమత్తం చేశారు. అయితే ఇది పూర్తిగా కల్పితం, మోసపూరితమైన వార్త. నకిలీ వార్తల ప్రచారంలో కొత్త పంథా. నిజానికి నేను క్రిప్టోల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు’’ అని ఆయన వెల్లడించారు. 

కాగా.. ఆనంద్‌ మహీంద్రాపై ఇలాంటి నకిలీ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. స్కూల్‌ పిల్లలకు స్టాక్‌ మార్కెట్‌ పాఠాలు బోధించాలని మహీంద్రా చెప్పినట్లు ఈ ఏడాది సెప్టెంబరులో ఓ వార్త వైరల్‌ అయ్యింది.  ‘విద్యార్థుల జీవితాన్ని మార్చే సూచన’ అంటూ వచ్చిన ఈ వార్తను నెట్టింట్లో తెగ షేర్‌ చేశారు. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను అలాంటి సూచనలేవీ చేయలేదని కొట్టిపారేశారు.

Read latest Business News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని