రెపో రేట్లు, ఎంసీఎల్ఆర్ మధ్య వ్యత్యాసం

పాలసీ రేట్లను తగ్గించినప్పుడు బ్యాంకులు వినియోగదారులకు తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని అందించాలని సెంట్రల్ బ్యాంక్ కోరుకుంది

Published : 06 Apr 2021 17:00 IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ రేట్లను పెంచినప్పుడు బ్యాంకుల‌పై గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. అదేవిధంగా ఆర్‌బీఐ పాలసీ రేట్లను తగ్గించినప్పుడు బ్యాంకులు రుణ రేట్ల‌ను తగ్గించాలి. కానీ బ్యాంకులు వెంట‌నే దీన్ని అమలు చేయ‌డంలేద‌ని పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి. 
పాలసీ రేట్లను తగ్గించినప్పుడు బ్యాంకులు వినియోగదారులకు తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని అందించాలని సెంట్రల్ బ్యాంక్ కోరింది.  ఈ కారణంగా, ఆర్‌బీఐ ఇటీవల ఒక పద్దతిని ప్రవేశపెట్టింది, ఇది చాలా పారదర్శకంగా ఉంది. అదే ఎక్స్‌ట‌ర్న‌ల్‌ బెంచ్‌మార్క్-ఆధారిత రుణ రేట్లు.
ఈ కొత్త విధానం అమ‌ల్లోకి రావ‌డంతో  ఇంత‌కుముందే రుణం తీసుకున్న‌వారికి, ఇప్పుడు రుణం తీసుకున్న‌వారికి రేట్ల‌లో చాలా వ్య‌త్యాసం ఉంటుంది. ఉదాహరణకు, రుణదాత కొత్త గృహ రుణాన్ని 8 శాతం వద్ద ఇస్తే,  ఇప్పటికే రుణం తీసుకున్న‌వారికి అది 9 శాతం లేదా 9.5 శాతం లేదా 10 శాతం వద్ద ఉండవచ్చు.
 వడ్డీ రేట్లను  ఎలా నిర్ణయిస్తారు?
బ్యాంకులు సాధారణంగా అంతర్గత రేటును కలిగి ఉంటాయి, అదే బెంచ్‌మార్క్‌ రేటు. అన్ని రుణాలపై వడ్డీ రేట్లు దీని ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు, రుణదాత బెంచ్‌మార్క్ రేటు 6 శాతం అనుకుంటే, వాహ‌న రుణాన్ని బెంచ్‌మార్క్ రేటు కంటే 2 శాతం ఎక్కువ రేటుతో అందిస్తుంది, అప్పుడు అది 8 శాతం అవుతుంది. అదేవిధంగా, ఇది వ్యక్తిగత రుణాల విష‌యంలో బెంచ్‌మార్క్‌ రేటు కంటే ఎక్కువ‌గా 8 శాతం లేదా 14 శాతం అధిక రేటు వద్ద అందించవచ్చు.
ప్రారంభంలో, ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ రేటును పారదర్శకంగా మార్చడంపై దృష్టి పెట్టింది. ఇది బెంచ్‌మార్క్‌ రేట్లను లెక్కించడానికి వివిధ మార్గాలను ప్రవేశపెట్టింది. అంతకుముందు, బ్యాంకులు ప్రైమ్ లెండింగ్ రేట్ (పీఎల్ఆర్‌) ను కలిగి ఉండేవి, తరువాత బేస్ రేట్, తరువాత ఎంసిఎల్ఆర్ అందుబాటులోకి వ‌చ్చింది.
కొత్త బెంచ్ మార్క్:
వీటిలో ఏదీ సమస్యను పరిష్కరించనప్పుడు, సెంట్రల్ బ్యాంక్ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది- అదే ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్‌ -ఆధారిత రుణ రేట్లు. బ్యాంకుల అంతర్గత బెంచ్‌మార్క్‌ రేట్లను మరింత పారదర్శకంగా మార్చడానికి మార్గాలను చూసే బదులు, బ్యాంకులు తమ రుణ‌ రేటు ఎక్స్‌ట‌ర్న‌ల్‌  బెంచ్ మార్క్‌తో అనుసంధానించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ తెలిపింది. ఎక్స్‌ట‌ర్న‌ల్  బెంచ్ మార్క్‌గా, రెపో రేటు, మూడు నెలల ట్రెజరీ బిల్లు లేదా ఆరు నెలల ట్రెజరీ బిల్లుల‌ను సూచించింది. అయితే చాలా బ్యాంకులు రెపో రేటును స్వీకరించాయి. బ్యాంకులు  ఇప్పుడు బెంచ్‌మార్క్ రేట్ల‌కు అనుగుణంగా కాకుండా ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్ మార్క్ ఆధారంగా రుణాల‌ను అందిస్తాయి. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు లేదా పెంచినప్పుడు, రుణగ్రహీతలు తమ ప్రస్తుత రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుందని లేదా తగ్గుతుంద‌ని ముందే తెలుసుకోవ‌చ్చు.

వెంట‌నే మార్చుకోండి:
 మీ గృహ రుణం లేదా ఇత‌ర రుణాలు అప్పుడు బ్యాంకులు బెంచ్‌మార్క్ ఆధారంగా జారీ చేసిన రుణ రేట్ల‌తో ఉంటే కొత్త విధ‌నానికి వెంట‌నే మార‌డం మంచిది. మీరు రెపో రేటు ఆధారిత రుణానికి మారితే  రుణంపై రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే, పారదర్శకత ఉంటుంది. ఆర్‌బీఐ పాలసీ రేట్లను తగ్గించినప్పుడు లేదా పెంచేటప్పుడు, మీ రుణంపై వడ్డీ రేటు అదే నిష్పత్తిలో పెరుగుతుంది లేదా తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని