ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ఓ కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేయండి

ఆన్‌లైన్ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించేందుకు ఈపీఎఫ్ఓ కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేసుకునే స‌దుపాయాన్ని తీసుకొచ్చింది.........

Published : 24 Dec 2020 17:15 IST

ఆన్‌లైన్ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించేందుకు ఈపీఎఫ్ఓ కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేసుకునే స‌దుపాయాన్ని తీసుకొచ్చింది

కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు ఉపసంహరణ క్లెయిమ్‌ వంటి ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకునేలా చేయడానికి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్‌ఓ) కోవిడ్ -19 మహమ్మారి ఉన్నప్పటికీ జూలై 2020 లో తన చందాదారుల కెవైసీని అప్‌డేట్ చేయడంలో గణనీయమైన పురోగతి సాధించిందని ప్రభుత్వం తెలిపింది.

2020 జూలై నెలలో, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన చందాదారుల యఏఎన్‌లో 2.39 లక్షల ఆధార్ నంబర్లు, 4.28 లక్షల మొబైల్ నంబర్లు , 5.26 లక్షల బ్యాంకు ఖాతాలను నవీకరించడంలో విజయవంతమైందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. సంస్థ, ఆన్‌లైన్ సేవలను విస్తరించే ప్రయత్నంలో, ఆన్‌లైన్ ద్వారా తన సేవలను అందించేందుకు కేవైసీ డేటాను అప్‌డేట్ చేస్తోంది.

కేవైసీ నవీకరణ అనేది, కేవైసీ వివరాలతో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ను లింక్ చేయడం ద్వారా దాని చందాదారుల గుర్తింపు ధృవీకరణకు సహాయపడే ప్రక్రియ. దీంతో ఈపీఎఫ్‌ సభ్యుని ఏకీకృత సభ్యుల పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ సేవలను పొందటానికి వీలు కల్పిస్తుంది. తుది ఉపసంహరణ , అడ్వాన్స్‌ల కోసం ఆన్‌లైన్ దావాను దాఖలు చేయవచ్చు.

కేవైసీ వివరాలు అంటే పాన్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలతో సహా ఉద్యోగి డేటా. మీరు ఈ వివరాలను ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఇంకా నవీకరించకపోతే, ఈపీఎఫ్ఓ యూఏఎన్‌ పోర్టల్‌ ద్వారా చేయడం మంచిది. కేవైసీ వివరాలను నవీకరించడానికి లేదా మార్చడానికి, సభ్యునికి UAN అవసరం. సభ్యుడు పోర్టల్‌కు లాగిన్ అయిన త‌ర్వాత‌ అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా కేవైసీ ని నవీకరించవచ్చు.

KYC వివరాలను నవీకరించే ప్రక్రియ చూద్దాం

  1. మీ UAN, పాస్‌వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్‌ ఖాతాకు లాగిన్ అవ్వండి.
  2. ‘Manage’ సెక్ష‌న్‌లో ‘KYC’ ఆప్ష‌న‌పై క్లిక్ చేయండి.
  3. పాన్, ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్), రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, బ్యాంక్ వివరాలు వంటి వివరాలను ఫారంలో నింపాలి.
  4. ఇప్పుడు, మీరు అప్‌డేట్ చేయాల‌నుకున్న‌దానిపై టిక్ చేయండి.
  5. మీ పేరు, డాక్యుమెంట్ సంఖ్యను నమోదు చేయండి.
  6. బ్యాంక్ వివరాల విషయంలో ఐఎఫ్‌ఎస్‌సి, పాస్‌పోర్ట్, డిఎల్ విషయంలో గడువు తేదీ వంటి అదనపు వివరాలు అడ‌గ‌వ‌చ్చు.
  7. ఇప్పుడు, ‘సేవ్’ బటన్ పై క్లిక్ చేయండి.
  8. మీ వివరాలు నవీకరించబడకూడదనుకుంటే, ‘X’ గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా మీరు KYC ప్రక్రియను రద్దు చేయవచ్చు.
  9. మీ వివరాలను సంబంధిత విభాగం డేటా నుంచి ఈపీఎఫ్ఓ ​​ధృవీకరిస్తుంది
  10. వివరాలు సరిపోలిన తర్వాత, పత్రం ధృవీకర‌ణ పూర్త‌వుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని