ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సర్వీస్‌

చెల్లింపులను బ్యాంకుకి వెళ్ళే అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో క్రమానుగతంగా చేసేందుకు ఉపయోగపడే సేవ..

Updated : 15 Oct 2022 16:43 IST

నెల వారీ లేదా క్రమానుగతంగా జరపవలసిన చెల్లింపులను బ్యాంకుకు ఒక్క ఆదేశం ఇవ్వడం ద్వారా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో సులువుగా జరిపేందుకు ఉపయోగ పడే సేవ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఈసీఎస్). ఈ సేవ ద్వారా నెలవారీ చెల్లించే అద్దె, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడులు, బీమా పాలసీల ప్రీమియంలు సులువుగా, అవసరమైన మొత్తాన్ని, ఎంచుకున్న తేదీన చెల్లించవచ్చు.

ఈసీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు

క్రమానుగత చెల్లింపులు జరిపేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈసీఎస్‌ డెబిట్‌ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. ఆయా సంస్థలకు చెల్లింపులు జరపమని బ్యాంకుకు మ్యాండేట్‌ను అందించాలి.

మ్యాండేట్‌లో ఉండవలసిన వివరాలు

  • బ్యాంకు బ్రాంచి, ఖాతా వివరాలు
  • చెల్లింపులు జరపవలసిన ఖాతా వివరాలు
  • నిర్దేశించిన తేదీ, మొత్తం
  • చెల్లింపులు చేస్తున్న కారణం
  • ఒక రోజులో చెల్లించే గరిష్ఠ మొత్తం

ఈసీఎస్‌ విధానం వల్ల లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు

  • వినియోగదారుడు బ్యాంకుకు, చెల్లింపు కేంద్రానికి వెళ్లకుండానే ఆయా తేదీల్లో చెల్లింపులు జరుగుతాయి.
  • సమయానికి చెయ్యాల్సిన చెల్లింపులు చేయక రుసుములు పడే సమస్య తప్పుతుంది.
  • ఖాతా నుంచి ఈసీఎస్‌ డెబిట్‌కు సంబంధించిన సమాచారం మొబైల్‌కు వస్తుంది.
  • ఖాతా వివరాలను వినియోగదారుడు సరిచూసుకోవచ్చు.

రుసుములు

ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నందుకు బ్యాంకులు ఎలాంటి రుసుములు విధించవు.

ఈసీఎస్‌ ద్వారా జరిగే చెల్లింపులు ఆపడం

గడువుకు ముందుగా చెల్లింపులు ఆపవలసిందిగా బ్యాంకుకు, చెల్లింపు చేస్తున్న సంస్థకు తెలియజేయడం ద్వారా ఎప్పుడైనా ఆపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని