Gold Rate:  పెరిగిన పసిడి ధరలు 

బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. దిల్లీలో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.441లు పెరగడంతో రూ.48,530కి చేరింది. ...

Updated : 11 Jun 2021 20:30 IST

దిల్లీ: బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. దిల్లీలో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.441లు పెరగడంతో రూ.48,530కి చేరింది.  నిన్న 10 గ్రాములు రూ.48,089 వద్ద ట్రేడ్‌ అయింది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. శుక్రవారం రూ.1,148లు పెరగడంతో కిలో వెండి ధర రూ.71,432కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.70,284గా ఉంది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1896 డాలర్లుగా ట్రేడవుతుండగా.. ఔన్సు వెండి ధర 28.15 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ పసిడి ధరల్లో చోటుచేసుకున్న మార్పులే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపోతే, హైదరాబాద్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50వేలకు పైగా ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని