HDFC Home Loan: గృహరుణాలపై హెచ్డీఎఫ్సీ పండగ ఆఫర్!
కొత్తగా గృహ రుణాలు తీసుకోబోయే వినియోగదార్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పండగ ఆఫర్లను ప్రకటించింది. రుణమొత్తంతో సంబంధం లేకుండా.. గృహ రుణాన్ని 6.7 శాతం ప్రారంభ వడ్డీతో అందించనుంది....
ముంబయి: కొత్తగా గృహ రుణాలు తీసుకోబోయే వినియోగదార్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పండగ ఆఫర్లను ప్రకటించింది. రుణమొత్తంతో సంబంధం లేకుండా.. గృహ రుణాన్ని 6.70 శాతం ప్రారంభ వడ్డీతో అందించనుంది. అయితే, క్రెడిట్ స్కోర్ 800కి పైగా ఉండాలని షరతు విధించింది. అంతక్రితం ఉద్యోగులు రూ.75 లక్షలపైన గృహ రుణాలకు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి 7.30 శాతం వడ్డీ వర్తించేంది. తాజా ఆఫర్ కింద ఏ మొత్తానికైనా తక్కువలో తక్కువ 6.7 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. ఇటీవల ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం పండగ సీజన్ నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!