బ్యాంకు ఛార్జీలు త‌ప్పించుకునేందుకు 12 మార్గాలు

దేశంలోని అతిపెద్ద బ్యాంకులు గ‌త కొంత కాలంగా వినియోగ‌దారుల‌కు ఉచిత సేవ‌లు అందిస్తూ వేల కోట్లు ప‌న్నులు చెల్లిస్తున్నాయి. భ‌విష్య‌త్తులో ఈ భారం వినియోగ‌దారుల‌పై ప‌డే అవ‌కాశ‌ముంది. అయితే వీటిని త‌ప్పించుకునేందుకు 12 మార్గాలు అనుస‌రిస్తే అన‌వ‌స‌ర ఛార్జీలు చెల్లించ‌కుండా బ‌య‌ట‌ప‌డొచ్చు...

Published : 16 Dec 2020 16:10 IST

దేశంలోని అతిపెద్ద బ్యాంకులు గ‌త కొంత కాలంగా వినియోగ‌దారుల‌కు ఉచిత సేవ‌లు అందిస్తూ వేల కోట్లు ప‌న్నులు చెల్లిస్తున్నాయి. భ‌విష్య‌త్తులో ఈ భారం వినియోగ‌దారుల‌పై ప‌డే అవ‌కాశ‌ముంది. అయితే వీటిని త‌ప్పించుకునేందుకు 12 మార్గాలు అనుస‌రిస్తే అన‌వ‌స‌ర ఛార్జీలు చెల్లించ‌కుండా బ‌య‌ట‌ప‌డొచ్చు. అవి ఏంటంటే…

  1. ఏటీఎంని తెలివిగా ఉప‌యోగించండి

ఎందుకంటే చాలావ‌ర‌కు బ్యాంకులు అదే బ్యాంకు ఏటీఎం అయినా, ఇత‌ర ఏటీఎం అయినా 5 లావాదేవీల‌ను మాత్ర‌మే ఉచితంగా అందిస్తున్నాయి. అందుకే డ‌బ్బు అవ‌స‌ర‌మైన ప్ర‌తీసారి ఏటీఎంలో విత్‌డ్రా చేసుకోవ‌డం కంటే అవ‌స‌ర‌మైనంత‌ ఒకేసారి తీసుకుంటే అద‌న‌పు ఛార్జీల‌ను త‌ప్పించుకోవ‌చ్చు. దీంతో ఒక్కో లావాదేవీపై రూ.10- 20 వ‌ర‌కు ఆదా చేయ‌వ‌చ్చు.

  1. చెక్కుల కంటే నెట్ బ్యాంకింగ్ మేలు

అద‌నంగా చెక్ బుక్ కావాలంటే ఛార్జీలు వ‌ర్తిస్తాయి. అదే నెట్ బ్యాంకింగ్ ద్వారా న‌గ‌దు లావాదేవీలు అయితే పూర్తిగా ఉచితం.
చెక్‌బుక్‌కి రూ.20 నుంచి రూ.150 చొప్పున ఆదా చేయ‌వ‌చ్చు.

  1. క్రెడిట్ కార్డ్ బిల్లును స‌మయానికి చెల్లించండి

క్రెడిట్ కార్డు రుణాల‌కు వ‌డ్డీ అధిక శాతంలో ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. దీనిని వాయిదా వేయ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లిస్తుండాలి. ఇలా చేస్తే వార్షికంగా 39-43% వ‌ర‌కూ ప‌డే పెనాట్టీని ఆప‌వ‌చ్చు. బిల్లు చెల్లించ‌డం మూడు రోజులు ఆల‌స్యం చేసినా రూ.750 వ‌ర‌కు ఛార్జీలు వ‌ర్తిస్తాయి.

  1. ఆటో-డెబిట్‌ను ఎంచుకోండి

క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించేందుకు ఆటో-డెబిట్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌డం మేలు. అద‌న‌పు ఛార్జీలు ప‌డ‌కుండా ఉండాలంటే క్రెడిట్ కార్డ్ బిల్లులో క‌నీసం 5 శాతం అయినా ఆటో-డెబిట్ అయ్యే విధంగా చేసుకోవాలి. దీంతో సంవ‌త్స‌రానికి 39-42 శాతంవ ర‌కూ ప‌డే పెనాట్టీని ఆప‌వ‌చ్చు.

  1. బిల్ పే స‌ర్వీసెస్‌

విద్యుత్‌, మొబైల్ వంటి బిల్లులు స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే అద‌నంగా ఛార్జీలు ప‌డ‌తాయి. బిల్ పే స‌ర్వీసులను ఉప‌యోగించుకుంటే వీటి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఆల‌స్య రుసుములు రూ.40 నుంచి రూ.100 వ‌ర‌కు ఉంటాయి. అయితే బ్యాంకు నుంచి నేరుగా బిల్లులు స‌మ‌యానికి చెల్లించే విధంగా ఉంటే ఈ ఛార్జీల భారం ప‌డ‌దు.

  1. ఆన్‌లైన్ బ్యాంక్ స్టేట్‌మెంట్స్

బ్యాంకుకి వెళ్లి మీరు డాక్యుమెంట్ల రూపంలో స్టేట్‌మెంట్లు తీసుకుంటే రూ.100 వ‌ర‌కు బ్యాంకులు వ‌సూలు చేస్తాయి. అదే డిజిట‌ల్ రూపంలో ఇ-మెయిల్ ద్వారా స్టేట్‌మెంట్ తీసుకుంటే ఎలాంటి రుసుములు ప‌డ‌వు.

  1. బ్యాంకు శాఖ‌ల్లో న‌గదు లావాదేవీలు

బ్యాంకు శాఖ‌ల్లో నేరుగా లావాదేవీలు చేయ‌డం త‌గ్గించాలి. సాధార‌ణంగా బ్యాంకులు త‌మ శాఖ‌ల్లో3-4 సార్లు ఉచితంగా న‌గ‌దును తీసుకోవ‌చ్చు. దీని ద్వారా నెల‌కు రూ.50 నుంచి రూ.150 వ‌ర‌కు ఆదా చేసుకోవ‌చ్చు.

  1. క‌నీస నిల్వ‌ల‌ను ఉంచుకోవాలి

ఖాతాల్లో క‌నీస నిల్వ‌లు లేక‌పోతే నెల‌కు రూ.60 నుంచి రూ.100 వ‌ర‌కు ఛార్జీలు ప‌డ‌తాయి. కాబ‌ట్టి ఎప్పుడూ క‌నీస న‌గ‌దును ఖాతాలో ఉంచ‌డం మంచిది.

  1. త‌గినంత న‌గదు లేన‌ప్పుడు చెక్కులు వ‌ద్దు

ఖాతాలో త‌గినంత న‌గదు లేన‌ప్పుడు చెక్కుల‌ను ఇస్తే ఛార్జీలు ప‌డ‌టంతోపాటు చెక్ బౌన్స్ చ‌ట్టారిత్యా నేరం అవుతుంది. చెక్కుకు రూ.500 నుంచి రూ.750 వ‌రకు వ‌ర్తిస్తుంది.

  1. ఆన్‌లైన్ ద్వారా చెక్కుల ర‌ద్దు

బ్యాంకుకి వెళ్లి చెక్కుల‌ను ర‌ద్దు చేసుకోవ‌డం బ‌దులుగా ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెక్ క్యాన్సిల్ చేసుకుంటే రూ.100 నుంచి రూ.200 వ‌ర‌కు ఆదా చేయ‌వ‌చ్చు.

11.విత్‌డ్రాల‌కు క్రెడిట్‌ కార్డు వ‌ద్దు

క్రెడిట్ కార్డుద్వారా న‌గ‌దు విత్‌డ్రా చేస్తే రుసుములతో ఆటు అద‌నంగా వ‌డ్డీ చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. దీంతో మీరు 2.5 శాతం లేదా రూ.300 నుంచి రూ.500 వ‌ర‌కు అద‌న‌పు ఛార్జీల‌ను త‌ప్పించుకోవ‌చ్చు.

12.క్రెడిట్ లిమిట్ మించ‌కూడ‌దు

క్రెడిట్ కార్డ్ బిల్లులు ప‌రిమితి దాటితే ఛార్జీలు వ‌ర్తిస్తాయి. బ్యాంకు నిబంధ‌న‌ల‌ను బ‌ట్టి కార్డు ప‌రిమితికి మించితే 2.5 శాతం లేదా రూ.500 వ‌ర‌కు ఛార్జీలు వేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని