Gold Bonds: ఎస్‌బీఐ ద్వారా ఆన్‌లైన్‌లో

సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ యొక్క తాజా విడ‌త మే 17న ప్రారంభ‌మైంది.

Updated : 19 May 2021 13:38 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆన్‌లైన్‌లో సావ‌రిన్ గోల్డ్ బాండ్ల‌ను ఎలా కొనుగోలు చేయాలి ద‌శ‌ల వారీ గైడ్‌. సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కాన్ని న‌వంబ‌ర్ 2015లో కేంద్రం ప్రారంభించింది.

సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ 

ఇష్యూ మే 21న‌, బాండ్స్ మే 25న జారీ చేయ‌బ‌డ‌తాయి. సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ యొక్క తాజా విడ‌త మే 17న ప్రారంభ‌మైంది. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 సిరీస్‌-1 యొక్క ఇష్యూ ధ‌ర గ్రాముకు, రూ. 4,777గా నిర్ణ‌యించ‌బ‌డింది. దేశంలోని పెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆన్‌లైన్‌లో సావ‌రిన్ గోల్డ్ బాండ్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశాన్ని అందిస్తుంది. ఎస్‌బీఐ ఖాతాదారులు నేరుగా ఇ-స‌ర్వీసుల కింద ఈ బాండ్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

ఆర్‌బీఐతో సంప్ర‌దించి భార‌త ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తు చేసుకునే పెట్టుబ‌డిదారుల‌కు ఇష్యూ ధ‌ర నుండి గ్రాముకు రూ. 50 త‌గ్గింపును అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించింది. చెల్లింపు డిజిట‌ల్ మోడ్ ద్వారా చేసే మ‌దుపుదార్ల‌కు గోల్డ్ బాండ్ ఇష్యూ ధ‌ర గ్రాము బంగారానికి రూ. 4,727గా ధ‌ర నిర్ణ‌యించారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆన్‌లోన్‌లో ఈ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయ‌డానికి ఈ క్రింది ద‌శ‌ల‌ను అనుస‌రించాలి.

* మీ ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వండి

ఇ-స‌ర్వీసెస్‌పై క్లిక్ చేసి, `సావ‌రిన్ గోల్డ్ బాండ్‌`కి వెళ్లండి.

`ట‌ర‌మ్స్ అండ్ కండీష‌న్స్‌` ఎంచుకుని, `ప్రోసీడ్‌`పై క్లిక్ చేయండి.

రిజిస్ట్రేష‌న్ ఫార‌మ్ నింపండి. ఇది వ‌న్‌టైమ్ రిజిస్ట్రేష‌న్‌, `స‌బ్‌మిట్‌`పై క్లిక్ చేయండి.

కొనుగోలు రూపంలో చందా ప‌రిమాణం, నామినీ వివ‌రాల‌ను న‌మోదు చేయండి, ఇప్పుడు `స‌బ్‌మిట్‌`పై క్లిక్ చేయండి.

ఈ పైన తెలిపిన విధంగానే కాకుండా ఈ బాండ్ల మ‌దుపుదార్లు వాణిజ్య బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), ఆర్‌బీఐ నియ‌మించిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి కూడా బంగారు బాండ్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

భౌతిక బంగారం డిమాండ్‌ను త‌గ్గించ‌డానికి, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉప‌యోగించే ఆర్థిక పొదుపుగా మార్చ‌డానికి 2015 న‌వంబ‌ర్‌లో సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని