ఇండియా పోస్ట్ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, ఇ-కామ‌ర్స్ సేవ‌లు

పోస్టాఫీస్ పొదుపు ఖాతా వినియోగ‌దారుల కొర‌కు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ స‌దుపాయాన్ని స‌మాచార శాఖ మంత్రి మ‌నోజ్ సిన్హా ప్రారంభించారు. బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేనివారికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం 17 కోట్ల పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు ఉన్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో న‌గ‌దును రిక‌రింగ్ డిపాజిట్‌కు, పీపీఎఫ్‌కు కూడా బ‌దిలీ చేసుకోవ‌చ్చు...

Published : 18 Dec 2020 14:35 IST

పోస్టాఫీస్ పొదుపు ఖాతా వినియోగ‌దారుల కొర‌కు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ స‌దుపాయాన్ని స‌మాచార శాఖ మంత్రి మ‌నోజ్ సిన్హా ప్రారంభించారు. బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేనివారికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం 17 కోట్ల పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు ఉన్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో న‌గ‌దును రిక‌రింగ్ డిపాజిట్‌కు, పీపీఎఫ్‌కు కూడా బ‌దిలీ చేసుకోవ‌చ్చు.

అదేవిధంగా ఇ-కామర్స్‌ వ్యాపారంలోకి పూర్తి స్థాయిలో అడుగుపెడుతున్నట్లు ఇండియా పోస్ట్‌ ప్రకటించింది. ఉత్పత్తుల డెలివరీకి తన పార్సిల్‌ వ్యాపారాన్ని వినియోగించుకోనుంది. ‘పార్సిల్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా తపాలా శాఖ(డీఓపీ)లో నిర్ణయాలను తీసుకునే ప్రక్రియను సరళీకరించాం. ఇపుడు పార్సిల్‌ రేట్లు, సంబంధిత నిబంధనలపై అది వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇంటి వద్దకు వస్తువులను డెలివరీ చేసే విషయంలో ఇ-కామర్స్‌ సేవలకు ఇండియా పోస్ట్‌ తన విస్తార నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనుందని ఇ-కామ‌ర్స్ పోర్టల్‌ను ప్రారంభించిన త‌ర్వాత కేంద్ర‌ మంత్రి మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు.

అంతక్రితం పార్సిల్‌ డెలివరీ రేట్లకు సంబంధించిన ఏ నిర్ణయమైనా అత్యున్నతాధికార్లు తీసుకోవాల్సి ఉండేది. ఇందుకు ఎక్కువ సమయం పట్టేది. ఇపుడు పార్సిల్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటు ద్వారా పోటీని తట్టుకోగలమని సిన్హా అంటున్నారు. అందరు ఇ-కామర్స్‌ విక్రేత నమోదుకు మేం సిద్ధంగా ఉన్నాం. విక్రేతల నుంచి ఉత్పత్తులను అందుకుని వినియోగదార్ల ఇళ్లకు చేరవేస్తామ’ని ఆయన వివరించారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 1.5 ల‌క్ష‌ల ప్రాంతాల‌కు పోస్టాఫీస్ నెట్‌వ‌ర్క్ విస్త‌రించి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విక్రేత‌లు, స్వ‌యం స‌హాయ‌క బృందాలు, మ‌హిళా వ్యాపారులు, కేంద్ర రాష్ర్ట ప్ర‌భుత్వ సంస్థ‌లు, సొంత వ్యాపార సంస్థ‌లు త‌మ వ‌స్తువుల‌ను దేశ‌వ్యాప్తంగా కొనుగోలుదారుల‌కు విక్ర‌యించివ‌చ్చు.

ఉత్ప‌త్తులు త‌పాలా శాఖ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా చేర‌వేయ‌నున్నారు. త‌పాలా శాఖ సెక్ర‌ట‌రీ అనంత నారాయ‌ణ్ మాట్లాడుతూ దీంతో వ‌స్తువుల‌ను రిట‌ర్న్ కూడా చేసుకునే అవ‌కాశం ఉంది. విక్రేత‌లు త‌మ‌ పేర్ల‌ను ఆరు నెల‌ల వ‌ర‌కు ఉచితంగా న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని