బంగారం కొనుగోలు చేసిన‌ ర‌శీదులు భ‌ద్ర‌ప‌రుస్తున్నారా?

ప‌న్ను అధికారులకు దృవీక‌ర‌ణ కోసం ఈ బిల్లుల‌ను ఆధారంగా చూప‌వ‌చ్చు...

Published : 18 Dec 2020 13:49 IST

బంగారు ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేయ‌డం ఎక్కువ ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. చాలావ‌ర‌కు కొనుగోలు చేసిన బిల్లులు ప్ర‌జలు జాగ్ర‌త్త‌గానే దాచుకుంటారు. త‌ర్వాత ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేసిన తేది, బ‌రువు, ధ‌ర వంటివి చూసుకునేందుకు ఇది అవ‌స‌రం అవుతుంది. అయితే ఈ బిల్లులు దాచుకోవ‌డం వ‌ల‌న మ‌రో ఉప‌యోగం కూడా ఉంది. ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల స‌మ‌యంలో ప‌న్ను అధికారులకు దృవీక‌ర‌ణ కోసం బిల్లును చూప‌వ‌చ్చు.

ఒక వ్య‌క్తి బంగారం, నాణేలు లేదా జువెలరీ కొనుగోలు చేసిన‌ప్పుడు ఇన్‌వాయిస్ (బిల్లు) జాగ్ర‌త్త‌గా పెట్టుకుంటే కొనుగోలుకు సాక్ష్యంగా చూపే అవ‌కాశం ఉంటుంది. బంగారం కొనుగోళ్ల ఇన్‌వాయిస్‌ల‌ను చూపించేందుకు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆదాయ ప‌న్ను ప‌రిదిలోకి వ‌చ్చేవారు రిట‌ర్నుల స‌మ‌యంలో ఆదాయాన్ని లెక్క చూపాల్సి ఉంటుంది, ఇన్‌వాయిస్ ఉంటే బంగారం కొనుగోలు చేసిన‌ట్లుగా ఆధారాలు చూప‌వ‌చ్చు.

ఆదాయం రూ.50 ల‌క్ష‌ల కంటే అధికంగా ఉండి బంగారం నిల్వ‌లు ఐటీఆర్ స‌మ‌యంలో Schedule AL’ లో చూపాలి. ప్ర‌తి ఏడాది ఇవి ట్రాక్ చేస్తారు. విదేశాల్లో మీకు ఆస్తులు ఉంటే దృవీక‌ర‌ణ కోసం 16 ఏళ్ల వ‌ర‌కు సంబంధిత డాక్యుమెంట్ల‌ను చూప‌మ‌ని అడ‌గ‌వ‌చ్చు. విదేశాల్లో బంగారం ఉంటే కూడా విదేశీ ఆస్తులుగా ప‌రిగ‌ణించి ఐటీఆర్ దాఖ‌లు చేయాలి.

ప‌రిమిత బంగారాన్ని నిల్వ ఉంచుకోవ‌చ్చు:
2016 లో సీబీడీటీ, జారీ చేసిన స‌ర్క్కులార్ ప్ర‌కారం బంగారం నిల్వ ఉంచుకునేందుకు ప‌రిమితులు లేవ‌ని చెప్పింది. అయితే బంగారం కొనుగోలు చేసిన ఆదాయాన్ని లెక్క చూపాలి. వార‌స‌త్వంగా వ‌చ్చిన బంగారం ఆస్తుల‌పై కూడా ఎలాంటి ప‌రిమితి లేదు. ఈ సర్క్కులార్‌లో స్ప‌ష్ట‌మైన మ‌రో విష‌యం ఏంటంటే…ప‌రిమితి లోపు ఉన్న‌ బంగారాన్ని సీజ్ చేసేందుకు వీలుండ‌దు.

వివాహం అయిన మ‌హిళ‌ల వ్ద‌ద 500 గ్రాములు, కానీ మ‌హిళ‌ల వ‌ద్ద 250 గ్రాములు, 100 గ్రాములు పురుషుల వ‌ద్ద ఉంటే సీజ్ చేసేందుకు వీల్లేదు. సర్క్యులర్ ప్రకారం, సంప్రదాయాలతో సహా ఇత‌ర కార‌ణాల‌ ఆధారంగా పన్ను అధికారి బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకోలేరు . పైన సూచించిన పరిమితులు కుటుంబ సభ్యులు కలిగి ఉన్న ఆభరణాలకు మాత్రమే వర్తిస్తాయని గమనించడం ముఖ్యం. ఇత‌ర‌ వ్యక్తికి చెందిన ఆభరణాలు అయితే స్వాధీనం చేసుకుని జప్తు చేయవచ్చు.

వార‌సత్వంగా ల‌భించిన బంగారానికి ఆధారం ఎలా చూపాలి?
వారసత్వంగా వచ్చిన బంగారం విషయంలో… బంగారం కొనుగోలు ద్వారా కాకుండా ఇత‌ర రూపాల్లో పొందితే పన్ను చెల్లింపుదారుడు బహుమతి దస్తావేజు, ఒప్పంద ప‌త్రం లేదా వీలునామా కాపీని ఇవ్వాలి. అందుబాటులో ఉంటే అసలు ఇన్వాయిస్‌ల కాపీలను కూడా ఇవ్వవచ్చు. ఎలాంటి సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలు లేన‌ప్పుడు కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి, సంప్ర‌దాయాలు వంటివి ఆదాయ ప‌న్ను శాఖ‌వారు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని