Trai data: జియో బిగ్‌ జంప్‌.. ఎయిర్‌టెల్‌కు పెరిగిన చందాదారులు.. వీఐకి మళ్లీ నిరాశ!

ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో మరోసారి పెద్ద సంఖ్యలో చందాదారులను తన ఖాతాలో వేసుకుంది.

Published : 23 Sep 2021 21:39 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో మరోసారి పెద్ద సంఖ్యలో చందాదారులను తన ఖాతాలో వేసుకుంది. జులై నెలలో ఏకంగా 65.1 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 44.32 కోట్ల మంది చందాదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు జులై నెలకు సంబంధించిన సబ్‌స్క్రైబర్ల డేటాను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసింది.

జులై నెలకు గానూ ఎయిర్‌టెల్‌లో కొత్తగా 19.42 లక్షల మంది చందాదారులు చేరారు. దీంతో ఆ కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 35.40 కోట్లకు చేరింది. ఇదే సమయంలో వొడాఫోన్‌ ఐడియా 14.3 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. దీంతో ఆ కంపెనీ వైర్‌లెస్‌ చందాదారుల సంఖ్య 27.19 కోట్లుగా నమోదైంది. అలాగే, దేశంలో మొత్తం టెలిఫోన్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 120.9 కోట్లకు చేరినట్లు ట్రాయ్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని