WPI inflation: జులైలో టోకు ద్రవ్యోల్బణం 11.16 శాతం!

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ(డబ్ల్యూపీఐ) జులైలో స్వల్పంగా తగ్గి 11.16 శాతానికి పరిమితమైంది. అయితే, వరుసగా నాలుగో నెలా ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదుకావడం గమనార్హం....

Published : 16 Aug 2021 17:04 IST

దిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ(డబ్ల్యూపీఐ) జులైలో స్వల్పంగా తగ్గి 11.16 శాతానికి పరిమితమైంది. అయితే, వరుసగా నాలుగో నెలా ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదుకావడం గమనార్హం. 2020 జులైలో డబ్ల్యూపీఐ -0.25 శాతంగా ఉంది. ఈ ఏడాది మేలో ఇది రికార్డు స్థాయిలో గరిష్ఠంగా 12.94 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్‌లో 3.09 శాతంగా ఉండగా.. జులైలో అది సున్నా శాతానికి పరిమితమవడం గమనార్హం. ఉల్లి ధర పెరిగినప్పటికీ.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గడం విశేషం. ఉల్లి ధరల ద్రవ్యోల్బణం 72.01 శాతానికి చేరింది. ముడి చమురు, సహజవాయు విభాగాల ద్రవ్యోల్బణం 36.34 శాతం నుంచి పెరిగి 40.28 శాతానికి పరిమితమైంది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణ రేటు జులైలో 11.20 శాతంగా నమోదైంది. అంతకుముందు నెలలో ఇది 10.88 శాతంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని