పేమెంట్ బ్యాంకు ఖాతాను మ‌రో ఖాతాకి ఎందుకు జ‌త చేయాలి?

పేమెంట్ బ్యాంకింగ్ నెట్‌వ‌ర్క్‌ను అంద‌రికీ బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందుబాటులో ఉంచాల‌నే ఉద్దేశంతో ప్రారంభించారు. సాధార‌ణ బ్యాంకు ఖాతాల‌తో పాటు పేమెంట్ బ్యాంకు ఖాతా ఉంటే చాలా ర‌కాల ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. పేమెంట్ బ్యాంకులు సాంకేతిక‌త‌తో ప‌నిచేస్తాయి. ఇవి ప్రారంభించడం నిర్వ‌హ‌ణ సుల‌భంగా ఉంటుంది.

Published : 16 Dec 2020 21:32 IST

​​​​

పేమెంట్ బ్యాంకింగ్ నెట్‌వ‌ర్క్‌ను అంద‌రికీ బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందుబాటులో ఉంచాల‌నే ఉద్దేశంతో ప్రారంభించారు. సాధార‌ణ బ్యాంకు ఖాతాల‌తో పాటు పేమెంట్ బ్యాంకు ఖాతా ఉంటే చాలా ర‌కాల ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. పేమెంట్ బ్యాంకులు సాంకేతిక‌త‌తో ప‌నిచేస్తాయి. ఇవి ప్రారంభించడం నిర్వ‌హ‌ణ సుల‌భంగా ఉంటుంది.

దీంతో పాటు ఖాతా ప్రారంభించ‌డానికి లేదా క‌నీస నిల్వ లేక‌పోయినా ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు. నెల‌వారి బిల్లులు మీ మొబైల్‌తో సుల‌భంగా చెల్లించ‌వ‌చ్చు. ఈ ఖాతా గ‌రిష్ఠ ప‌రిమితి ల‌క్ష రూపాయలు. అంటే ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు కూడా ఇందులో డిపాజిట్ చేయ‌వ‌చ్చు. దీంతో ఆన్‌లైన్ పేమెంట్‌కి భ‌ద్ర‌త ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి త‌మ కుటుంబం మొత్తానికి ఏసీ ఫ‌స్ట్ క్లాస్ రిట‌ర్న్ టిక్కెట్ల‌ను త్రివేండ్రం రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో దిల్లీ నుంచి రామేశ్వ‌రానికి రూ.30 వేల‌తో బుక్ చేశాడు. టిక్కెట్ల‌ను ఆన్‌లైన్‌లో పేమెంట్ బ్యాంకు ఖాతా నుంచి బుక్ చేసాడు. అయితే ప్ర‌యాణానికి ముందు ఆరోగ్యం క్షీణించ‌డంతో టిక్కెట్ల‌ను ర‌ద్దు చేశాడు. అత‌డి ఖాతాలో ఇదివ‌ర‌కే రూ.90 వేలు ఉండ‌టంతో రీఫండ్ పేమెంట్ బ్యాంకుకి క్రెడిట్ కాలేదు. దీనికోసం ఐఆర్‌సీటీసిని సంప్ర‌దించే అవ‌స‌రం లేదు. ఎందుకంటే పేమెంట్ బ్యాంకు ఖాతాను మ‌రొక ఖాతా అనుసంధానం చేసి ఉండ‌టంతో ప‌రిమితి ల‌క్ష రూపాయ‌లు దాటిన మిగ‌తా డ‌బ్బు ఆ ఖాతాలోకి రీఫండ్ అవుతుంది.

ఒక‌వేళ వినియోగ‌దారుడు ఖాతాను స్వీప్ ఇన్ లేదా కాసా ప్ల‌స్ ఖాతాతో అనుసంధానం చేసి లేక‌పోతే ల‌క్ష‌కు మించిన రీఫండ్ ర‌ద్దు అవుతుంది… ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు పేమెంట్ బ్యాంకులు ఇప్పుడు ఇత‌ర వాణిజ్య‌ బ్యాంకుల‌తో జ‌త‌క‌డుతున్నాయి. దీంతో పేమెంట్ బ్యాంకుల నెట్‌వ‌ర్క్ కూడా మ‌రింత విస్త‌రిస్తోంది. పేమెంట్ బ్యాంకులో ప‌రిమితికి మించిన డ‌బ్బు స్వీప్ ఇన్ ఖాతాలోకి ఆటోమేటిక్‌గా చేరుతుంది. దీనికోసం వినియోగ‌దారుడు స్వీప్-ఇన్ ఖాతాను యాక్టివ్‌గా ఉంచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని