ప్రీమియం మ‌ధ్య‌లో ఆపినా..డ‌బ్బు ఎక్క‌డికీ పోదు!

బీమా పాల‌సీల‌ చెల్లింపు మ‌ధ్య‌లో ఆపేశారా? మెచ్యూరిటీకి ఎంత వ‌స్తుంది

Published : 27 Dec 2020 12:57 IST

25 ఫిబ్రవరి 2020 మధ్యాహ్నం 12:15

ట్రెడిష్‌న‌ల్ బీమా తీసుకునే వారికి ఎదుర‌య్యే సందేహాల్లో…బీమా పాల‌సీ కొన్నేళ్లు ప్రీమియం చెల్లింపులు చేసి ఆపివేస్తే ఎంత డ‌బ్బు వ‌స్తుంది? మెచ్యూరిటీ ముగియ‌క ముందు డ‌బ్బు తీసుకోవ‌డం వీల‌వుతుందా? ఎంత డబ్బు వెనక్కి ఇసారు? ప్రీమియం ఆపేస్తే ఎలా? మొద‌లైన సందేహాల‌ను ఉదాహ‌ర‌ణ‌తో నివృత్తి చేసే క‌థ‌నం ఇది. ఇలాంటి సందర్భాల్లో పెయిడ్ అప్ వాల్యూ అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది. పెయిడ్ అప్ వాల్యూ అంటే ఏంటి? ట‌ర్మ్ పాల‌సీలో ప్రీమియం చెల్లించ‌డం ఆపితే ఆ పాల‌సీ ముగిసిపోతుంది. అయితే దానికి ప్రీమియం కూడా త‌క్కువ‌గా ఉంటుంది.ఎక్కువ మొత్తం బీమా క‌వ‌రేజీ త‌క్కువ ప్రీమియంకు కావాలంటే ట‌ర్మ్ పాల‌సీనే మంచిద‌ని చెప్పాలి. అదే బీమా క‌వ‌రేజీతో పాటు పెట్టుబ‌డి చేసే బీమా పాల‌సీలు మ‌ధ్య‌లో ప్రీమియం చెల్లించ‌డం ఆపేసినా వాటికి కొంత విలువ ఉంటుంది. దాన్నే పెయిడ్ అప్ వాల్యూ అంటారు. అయితే పాల‌సీదారుడు చెల్లించిన ప్రీమియంల ఆధారంగా దీని విలువ ఉంటుంది.

పెయిడ్ అప్ విలువ లెక్కేసేందుకు:

మొత్తం ప్రీమియంల సంఖ్య, చెల్లించిన ప్రీమియంల సంఖ్య, హామీ మొత్తం. ఈ మూడు క‌లిపి గ‌ణిస్తే ఆ పాల‌సీ పెయిడ్ అప్ విలువ తెలుస్తుంది.

పెయిడ్ అప్ విలువ= (చెల్లించిన ప్రీమియంల సంఖ్య* బీమా హామీ మొత్తం.)\మొత్తం ప్రీమియంల సంఖ్య

ఉదాహ‌ర‌ణ:

  • బీమా హామీ మొత్తం రూ.3 ల‌క్ష‌లు

  • పాల‌సీ కాల‌ప‌రిమితి= 15 సంవ‌త్స‌రాలు (15 ప్రీమియంలు)

  • చెల్లించిన మొత్తం = 5 సంవ‌త్స‌రాలు (5 ప్రీమియంలు)

  • ఇంకా చెల్లించాల్సిన ప్రీమియంలు = 10

వార్షిక ప్రీమియం చెల్లించే విధంగా జీవిత బీమా పాల‌సీ తీసుకున్నారు అనుకుందాం. మొత్తం 15 ప్రీమియంలు. అప్ప‌టికి చెల్లించింది 5 ప్రీమియంలు. చెల్లింపు లు మ‌ధ్య‌లో ఆపివేసినా ప‌దేళ్ల త‌రువాత డ‌బ్బు ఉప‌సంహ‌రించేందుకు అవ‌కాశం ఉంటుంది. అప్పుడు పాల‌సీదారునికి ల‌భించే మొత్తాన్ని పెయిడ్ అప్ విలువ అంటారు.

మ‌ధ్య‌లో తీసుకుంటే?

బీమా కాల‌ప‌రిమితి మ‌ధ్య‌లో తీసుకుంటే దానికి స‌రెండ‌ర్ ఛార్జీలు చెల్లించాలి. పై ఉదాహ‌ర‌ణ‌లో అదే పాల‌సీదారుడు ఐదేళ్ల‌కు ప్రీమియం చెల్లించి, మ‌ధ్య‌లో ఉప‌సంహ‌రించ‌లేదు అనుకుందాం. ఆ సంద‌ర్భంలో మెచ్యూరిటీ ముగిశాక పాల‌సీదారుని పెయిడ్ అప్ విలువ‌ చేతికందుతుంది.

కొన్ని పాల‌సీల్లో అయితే పాల‌సీదారుడు ముందుగా చెల్లించిన‌ ప్రీమియంల ద్వారా కొంత పెట్టుబ‌డి చేస్తారు క‌దా ఆ డ‌బ్బుతో త‌దుప‌రి ప్రీమియంలు చెల్లించేలా ఆప్ష‌న్లు ఉంటాయి. అప్పుడు ఆ పాల‌సీ యాక్టివ్ గా ఉంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ పాల‌సీదారునికి ఏదైనా జ‌రిగితే ఆయ‌న‌ కుటుంబానికి బీమా హామీ మొత్తం అందుతుంది. కాక‌పోతే ఇక్క‌డ చెల్లించిన 20 ప్రీమియంలు ఆ పాల‌సీ పెయిడ్ అప్ విలువ‌లోనివే కాబ‌ట్టి హామీ మొత్తం నుంచి వాటిని మిన‌హాయించి మిగిలిన మొత్తాన్ని వారికి అందిస్తారు.

పై ఉదాహ‌ర‌ణ ప్ర‌కారం పెయిడ్ అప్ విలువ

పెయిడ్ అప్ విలువ = (చెల్లించిన ప్రీమియంల సంఖ్య * బీమా హామీ మొత్తం) / మొత్తం ప్రీమియంల సంఖ్య

paidup value caluclation.png

పై ఉదాహ‌ర‌ణ‌లో పెయిడ్ అప్ విలువ రూ.1,00,000. మెచ్యూరిటీ వ‌ర‌కూ ఆగి తీసుకుంటే వ‌స్తుంది. ఆ కాల‌ప‌రిమితిలో పాల‌సీ ద్వారా వ‌చ్చే బోన‌స్‌లు కూడా పొందొచ్చు. అదే మ‌ధ్యలో తీసుకుంటే ఆ పాల‌సీ నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌రెండ‌ర్ ఛార్జీలు చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని