Petrol: ఆగని పెట్రో పరుగు.. హైదరాబాద్‌లో లీటర్‌ ధర ఎంతంటే..

దేశంలో ఇంధన ధరలు భగభగ మండుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పైపైకి పోతూ కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. దీంతో బండి బయటకు

Updated : 28 Oct 2021 10:50 IST

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు భగభగ మండుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. దీంతో బండి బయటకు తీయాలంటేనే సామాన్యుడి గుండె గుభేల్‌ అంటోంది. గురువారం కూడా చమురు సంస్థలు ఇంధన ధరలను మరోసారి పెంచాయి. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు 31, 35 పైసలు చొప్పున పెంచాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.29కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో అయితే ఈ ధర ఏకంగా రూ. 114.14గా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.120కి చేరువవుతోంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112 దాటింది.

అక్టోబరులో ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 20 సార్లు సవరించారు. దీంతో ఒక్క నెలలోనే లీటర్ పెట్రోల్‌ ధర రూ.6.65, డీజిల్‌ ధర రూ.7.15 పెరిగింది. విమాన ఇంధనం కంటే పెట్రోల్‌ ధర 37.07శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ రూ.100 దాటి పరుగులు పెడుతోంది. 

దేశంలోని ప్రధాన నగరాల్లో చమురు ధరలు ఇలా..

* దిల్లీ - పెట్రోల్‌ రూ.108.29, డీజిల్‌ రూ.97.02

* ముంబయి - పెట్రోల్‌ రూ.114.14, డీజిల్‌ రూ.105.12

* చెన్నై - పెట్రోల్‌ రూ.105.13, డీజిల్‌ రూ.101.25

* కోల్‌కతా - పెట్రోల్‌ రూ.108.78, డీజిల్‌ రూ.100.14

* హైదరాబాద్‌ - పెట్రోల్‌ రూ.112.06, డీజిల్‌ రూ.102.98


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని