నెల‌కు ప‌ది వేల వ‌ర‌కు పెన్ష‌న్ పొందే అవ‌కాశం

సీనియ‌ర్ సిటిజ‌న్లు నెల‌కు రూ.1000 నుంచి రూ.10,000 వ‌ర‌కు పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు...

Updated : 22 Dec 2020 15:11 IST

సీనియ‌ర్ సిటిజ‌న్లు నెల‌కు రూ.1000 నుంచి రూ.10,000 వ‌ర‌కు పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు

వ‌యోవృద్ధుల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించే ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న(పీఎమ్‌వీవీవై)లో చేరేందుకు మార్చి 31, 2020 వ‌ర‌కు గ‌డువు ఉంది. ఇందులో చేరేందుకు 60 ఏళ్లు అంత‌కుమించిన వ‌య‌సు వారు అర్హులు. ఇందులో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న్ పొందుతూ సంతోషంగా జీవ‌నం కొన‌సాగించ‌వ‌చ్చు.

మీరు ఎంచుకున్న కాల‌ప‌రిమితి ఆధారంగా ఒక‌నెల‌, త్రైమాసికం, ఆరు నెల‌లు లేదా ఏడాదిని బ‌ట్టి ఇది వార్షికంగా 8 శాతం నుంచి 8.30 శాతం వ‌ర‌కు క‌చ్చిత‌మైన రాబ‌డి ఇస్తుంది. ఈ ప‌థ‌కం ద్వారా వ‌చ్చిన దానిపై మీ శ్లాబు ప్ర‌కారం ప‌న్ను ప‌డుతుంది.

నెల‌కు క‌నీసం రూ.1000 పెన్ష‌న్ పొందేందుకు రూ.1.5 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. గ‌రిష్ఠంగా 10 వేల వ‌ర‌కు పెన్ష‌న్ పొందేందుకు రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని