Pulse oximeter: పల్స్‌ ఆక్సీమీటర్‌ ధరలు భారీగా తగ్గాయ్‌

కొవిడ్‌ బాధితుల చికిత్సలో కీలకంగా మారిన పల్స్‌ ఆక్సీమీటర్, నెబ్యులైజర్‌ వంటి 5 రకాల వైద్య పరికరాల ధరలు 88 శాతం వరకు తగ్గాయని రసాయనాలు, ఎరువుల శాఖ తెలిపింది. కొవిడ్‌ బాధితుల శ్వాస, చక్కెర శాతం, రక్తపోటు, జ్వరం పరీక్షించేందుకు.....

Published : 25 Jul 2021 17:53 IST

దిల్లీ: కొవిడ్‌ బాధితుల చికిత్సలో కీలకంగా మారిన పల్స్‌ ఆక్సీమీటర్, నెబ్యులైజర్‌ వంటి 5 రకాల వైద్య పరికరాల ధరలు 88 శాతం వరకు తగ్గాయని రసాయనాలు, ఎరువుల శాఖ తెలిపింది. కొవిడ్‌ బాధితుల శ్వాస, చక్కెర శాతం, రక్తపోటు, జ్వరం పరీక్షించేందుకు ఉపయోగించే పల్స్‌ ఆక్సీమీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్, డిజిటల్‌ థర్మామీటర్‌తో పాటు శ్వాస సంబంధ ససమ్యలు పరిష్కరించేందుకు వినియోగించే నెబ్యులైజర్‌ ధరలు కూడా గణనీయంగా పెంచి విక్రయించారు. వీటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే ట్రేడ్‌ మార్జిన్‌ను గరిష్ఠంగా 70 శాతానికి పరిమితం చేస్తూ, నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈనెల 20 నుంచి ఈ వైద్య పరికరాల ధరలు దిగొచ్చినట్లు పేర్కొంది. 2021, జులై 23 నాటికి 684 బ్రాండ్ల వైద్య పరికరాలు నమోదు కాగా.. 620 (91 శాతం) పరికరాల ఎంఆర్‌పీ ధరలను ఆయా సంస్థలు సవరించాయి. ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్‌కు అందించే ధర, ఎంఆర్‌పీ మధ్య 709 శాతం వరకు వ్యత్యాసం ఉంది. దీన్ని 10 రెట్లకు పైగా తగ్గించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని