RateGain IPO: ఈ ‘సాస్‌’ కంపెనీలో పెట్టుబడి పెడతారా?

దిల్లీ: ప్రయాణ, ఆతిథ్య రంగంలోని పరిశ్రమలకు సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే ప్రముఖ సంస్థ రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే ఈ సబ్‌స్క్రిప్షన్‌ డిసెంబరు 9న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌లు సోమవారమే ప్రారంభమయ్యాయి. మొత్తం రూ.375 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 2.26 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.

ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలు...

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: డిసెంబరు 07, 2021

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: డిసెంబరు 09, 2021

బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: డిసెంబరు 14, 2021

రీఫండ్‌ ప్రారంభ తేదీ: డిసెంబరు 15, 2021

డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: డిసెంబరు 16, 2021

మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: డిసెంబరు 17, 2021

ముఖ విలువ: రూ.01 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

లాట్‌ సైజు: 35 షేర్లు

కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 35 (ఒక లాట్‌)

గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 455 (13 లాట్లు)

ఐపీఓ ధర శ్రేణి: ₹405 - ₹425 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

నిధుల సమీకరణ అంచనా: రూ.1,335.7 కోట్లు

నిధుల వినియోగం: యూకేలో రుణాల చెల్లింపు, వ్యూహాత్మక కొనుగోళ్లు-భాగస్వామ్యాలు, కార్పొరేట్‌ అవసరాలు

సంస్థ వివరాలు..

ప్రపంచంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్‌ టెక్నాలజీ కంపెనీల్లో రేట్‌గెయిన్‌ ఒకటి. భారత్‌లో ఆతిథ్య, ప్రయాణ రంగాలకు సేవలందిస్తున్న అతిపెద్ద ‘సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్(సాస్‌)‌’ కంపెనీ కూడా ఇదే. హోటళ్లు, విమానయాన సంస్థలు, ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెంట్లు, మెటా సెర్చ్‌ కంపెనీలు, వెకేషన్‌ రెంటర్స్‌, ప్యాకేజ్‌ ప్రొవైడర్లు, కార్‌ రెంటల్స్‌, రైల్‌-ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, క్రూయిజ్‌లు, ఫెర్రీల వంటి వివిధ రంగాలకు ఈ కంపెనీ సేవలందిస్తోంది. ‘డేటా యాజ్‌ ఏ సర్వీస్‌-డాస్‌’, డిస్ట్రిబ్యూషన్‌, మార్కెటింగ్‌ టెక్నాలజీ(మార్క్‌టెక్‌) ద్వారా ఆయా కంపెనీలకు టెక్నాలజీ సొల్యూషన్స్‌ అందజేస్తోంది. జూన్‌ 30, 2021 నాటికి ఈ కంపెనీకి మొత్తం 1400 కంకపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. వీటిలో ఎనిమిది కంపెనీలు ఫార్చూన్‌ 500లో ఉండడం విశేషం. కెస్లర్‌ కలెక్షన్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌, ఓయో హోటల్స్‌ వంటి ప్రముఖ సంస్థలు రేట్‌గెయిన్‌ కస్టమర్ల జాబితాలో ఉన్నాయి.

ఆర్థిక వివరాలు(రూ.కోట్లలో)..

సంవత్సరం    2019     2020      2021

ఆదాయం      273      458        264

ఆస్తులు       285      397        440

లాభాలు      11.03   -20.10      -28.57

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని