రేజర్‌పే చేతికి టెరా ఫిన్‌ల్యాబ్‌..!

ఫిన్‌ టెక్‌ సంస్థ రేజర్‌పే బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ టెరా ఫిన్‌ ల్యాబ్‌ను కొనుగోలు చేసింది. టెరా ఫిన్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, రిస్క్‌ అండ్‌ క్యాపిటల్‌ సొల్యూషన్స్‌ సేవలను అందిస్తుంది.

Published : 19 Jul 2021 21:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫిన్‌ టెక్‌ సంస్థ రేజర్‌పే బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ టెరా ఫిన్‌ ల్యాబ్‌ను కొనుగోలు చేసింది. టెరా ఫిన్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, రిస్క్‌ అండ్‌ క్యాపిటల్‌ సొల్యూషన్స్‌ సేవలను అందిస్తుంది. ఈ డీల్‌ విలువ మాత్రం బయటకు వెల్లడించలేదు. యుకేకు చెందిన గెయిన్‌ క్రెడిట్‌ సంస్థకు టెరాఫిన్‌ అనుబంధ సంస్థ. గెయిన్‌ విస్తరణలో భాగంగా 2018లో దీనిని ప్రారంభించారు. 

ఈ కొనుగోలు విషయాన్ని రేజర్‌పే ఒక ప్రకటనలో వెల్లడించింది. టెరా ఫిన్‌ ల్యాబ్‌ కొనుగోలుతో మూలధన అవసరాలు తీరుస్తూ ఎంఎస్‌ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసే వ్యూహాం,  క్రెడిట్‌ అండర్‌రైటింగ్‌, రిస్క్‌మేనేజ్‌మెంట్‌లకు ఉపయోగపడుతుందని పేర్కొంది.   

ఈ మూడేళ్లలో రేజర్‌పే కొనుగోలు చేసిన మూడో సంస్థ ఇది. 2018లో థర్డ్‌ వాచ్‌ అనే సంస్థను కొనుగోలు చేసింది. ఇది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే కంపెనీ ఇది. 2019లో ఓప్‌ఫిన్‌ కంపెనీని కొనుగోలు చేసింది. ఇది పేరోల్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌లను తయారు చేస్తుంది.  ప్రస్తుతం రేజర్‌పే సంస్థ ప్రతి నెల 40-45శాతం వృద్ధి నమోదు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ టోటల్‌ పేమెంట్‌ వాల్యూమ్‌ విలువ 40 బిలియన్‌ డాలర్లను దాటింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌, ఎయిర్‌టెల్‌, ఓలా, జుమాటో, స్విగ్గీ, క్రెడ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వంటి సంస్థలతో సహా 80లక్షల వ్యాపారాలకు సేవలు అందిస్తోంది. 200 మిలియన్ల కస్టమర్లను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని