భారీ నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ను భారీ నష్టాల్లో మొదలుపెట్టాయి. ఉదయం 9.34 సమయంలో సెన్పెక్స్‌ 248 పాయింట్లు నష్టపోయి 51,075 వద్ద నిఫ్టీ 74 పాయింట్లు పతనమై 15,044 వద్ద ట్రేడవుతున్నాయి. ది న్యూ ఇండియా ఎస్యూర్‌, జనరల్‌ ఇన్స్యూరెన్స్‌,

Updated : 19 Feb 2021 09:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను భారీ నష్టాల్లో మొదలుపెట్టాయి. ఉదయం 9.34 సమయంలో సెన్పెక్స్‌ 248 పాయింట్లు నష్టపోయి 51,075 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు పతనమై 15,044 వద్ద ట్రేడవుతున్నాయి. ది న్యూ ఇండియా ఎస్యూర్‌, జనరల్‌ ఇన్స్యూరెన్స్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సువెన్‌ లైఫ్‌ సైన్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. అపోలో హాస్పటల్స్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

 ఇక ఎనర్జీ, టెలికామ్‌ సూచీలు అత్యధిక లాభాల్లో.. బ్యాంక్‌, మెటల్‌ సూచీలు అత్యధిక నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా సీఐఈ ఆటోమోటీవ్‌, ఏషియన్‌ టీ ఎక్స్‌పోర్ట్స్‌, బినానీ ఇండస్ట్రీస్‌, క్రొమాటిక్‌ ఇండియా, సండీసన్‌ ఇన్ఫ్రా, యూనిప్లే డెకార్‌, యూనిప్లే ఇండస్ట్రీస్‌, యూనివర్త్‌ సెక్యూరిటీస్‌ సహా పలు సంస్థలు నేడు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. 

ఇవీ చదవండి

మల్టీ క్యాప్‌..ఫ్లెక్సీ క్యాప్‌..పెట్టుబడికి ఏది మేలు?

నలభై దేశాలకు ‘కొవాగ్జిన్‌’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని