వైద్యపరికాల సరఫరా సమస్యలకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌!

కరోనా నివారణ నిమిత్తం వివిధ పరికరాలు, ఔషధాల ఎగుమతులు, దిగుమతులు త్వరితగతిన సాగేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌-డీజీఎఫ్‌టీ........

Published : 26 Apr 2021 22:44 IST

ఏర్పాటు చేసిన కేంద్ర వాణిజ్య శాఖ

దిల్లీ: కరోనా నివారణ నిమిత్తం వివిధ పరికరాలు, ఔషధాల ఎగుమతులు, దిగుమతులు త్వరితగతిన సాగేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌-డీజీఎఫ్‌టీ’ ఆధ్వర్యంలో కేంద్ర వాణిజ్య శాఖ ఓ ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఎగుమతులు, దిగుమతులకు కావాల్సిన అనుమతులు, కస్టమ్స్‌ క్లియరెన్సులు, డాక్యుమెంటేషన్‌, బ్యాంకింగ్‌ వంటి సమస్యల్లో జాప్యాన్ని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతారు.

ఈ నేపథ్యంలో ఎగుమతి, దిగుమతిదారులు లేదా ఇతర వ్యాపారస్థులు తమ సమస్యలను డీజీఎఫ్‌టీ వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేయవచ్చు. అలాగే ఫిర్యాదుకు సంబంధించిన పరిష్కారం ఎంత వరకు వచ్చిందో కూడా వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌, మెయిల్‌ ద్వారా కూడా సమాచారాన్ని తెలియజేస్తారు. విదేశాల నుంచే వచ్చే పరికరాలు, ఔషధాల అనుమతుల విషయంలో సమస్యలు రాకుండా, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు వాణిజ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని